Jasprit Bumrah's wife Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ తనను అవమానించడానికి ప్రయత్నించిన అభిమానికి గట్టి గుణపాఠం చెప్పింది. వాలెంటైన్స్ డే సందర్భంగా సంజనతో కలిసి బుమ్రా ఓ ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేయగా ఓ ట్రోల్ హద్దులు దాటి సంజనా గణేశన్ పై బాడీ షేమ్ కామెంట్స్ చేశారు. దీంతో ట్రోల్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. 

Jasprit Bumrah's wife Sanjana Ganesan: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత విరామం తర్వాత రాజ్ కోట్ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. అయితే , వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయ‌న భార్య‌తో క‌లిసి విడుద‌ల చేసిన ఒక ప్ర‌మోష‌నల్ వీడియో నేప‌థ్యంలో వారిపై ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో మరో మూడు టెస్టు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో టెస్టులో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ విజయం సాధించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ తర్వాత, ఇతర భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లలాగే, జస్ప్రీత్ బుమ్రా కూడా త‌న కుటుంబంతో సమయాన్ని గడిపాడు.

ఈ క్ర‌మంలోనే వాలెంటైన్స్ డే సందర్భంగా సంజనతో కలిసి బుమ్రా ఓ ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేయగా ఓ ట్రోల్ హద్దులు దాటి బుమ్రా భార్య సంజనా గణేశన్ పై బాడీ షేమ్ కామెంట్స్ తో ట్రోల్ చేశారు. దీంతో ఆమె ట్రోల్స్ కు కౌంటర్ ఇచ్చింది. "భాభీ మోతీ లాగ్ రహీ హై (మీరు లావుగా కనిపిస్తున్నారు)" అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశాడు. "స్కూల్ కి సైన్స్ పాఠ్యపుస్తకం తో యాద్ హోతీ నహీ హై తుమ్సే, బడా ఔరతోన్ కే బాడీస్ కే బారే మే కామెంట్ కర్ రహో హో. భాగో యహా సే (మీకు పాఠశాల సైన్స్ పాఠ్యపుస్తకాలు కూడా గుర్తుండవు, స్త్రీల శరీరాలపై వ్యాఖ్యానించడానికి మీకు ఎంత ధైర్యం.. ఇక్క‌డి నుంచి వెళ్లండి) అంటూ సంజనా గణేశన్ ఘాటుగా బదులిచ్చారు.