టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తండ్రి కారు చోరీకి గురవ్వడం కలకలం సృష్టించింది. తన ఇంటి ఆవరణలోని యూఎస్‌వీ కారు దొంగతనానికి గురైందని గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున గంభీర్ కారు చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోని రాజేంద్రనగర్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తును వేగంగా నిర్వహించారు.

Also Read:నేను భారత్ ఓడిపోతుందని చెప్పానా, ఎక్కడ: పాక్ మాజీ బౌలర్‌‌ను కడిగేసిన స్టోక్స్

సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూనే మరోవైపు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఢిల్లీలో ప్రముఖుల ఇళ్లే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు.

కొద్దిరోజుల క్రితం ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు కూడా చోరీకి గురైందన్న సంగతి తెలిసిందే. తన వాగనార్ కారు చోరీకి గురైందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం అప్పట్లో విస్మయానికి గురి చేసింది.

Also Read:తెలుగు సినిమాను వదలని డేవిడ్ వార్నర్: రేపటి నుంచి ‘‘ మైండ్ బ్లాక్ ’’

ఈ కారుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం వుందని కేజ్రీవాల్ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. అయితే దానిని పోలీసులు కారు ఆచూకీని కనిపెట్టడంతో కథ సుఖాంతమైంది.