ఇలాంటి సంఘటనలు ఇఫ్పటి వరకు చాలా చూసే ఉంటారు. కానీ, క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ లో కి కోడి దూరం ఎప్పుడైనా చూశారా? తాజాగా అదే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కామన్ గా అందరూ ఇష్టపడేదాంట్లో క్రికెట్ ముందు వరసలో ఉంటుంది. త్వరలోనే వరల్డ్ కప్ కూడా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ తామే గెలవాలి అని ప్రతి టీమ్ అనుకుంటుంది. కానీ, చివరి వరకు ఏ టీమ్ గెలుస్తుందో అస్సలు చెప్పలేం. చివరి బాల్ లో కూడా ఫలితాలు మారిన సందర్భాలు ఉన్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే, అప్పుడు క్రికెట్ స్టేడియంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మ్యాచ్ మధ్యలో పాములు రావడం, లేదంటే తమ అభిమాన క్రికెటర్ కోసం ఫ్యాన్స్ పెరిగెత్తుకు రావడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఇఫ్పటి వరకు చాలా చూసే ఉంటారు. కానీ, క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ లో కి కోడి దూరం ఎప్పుడైనా చూశారా? తాజాగా అదే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వెస్టిండీస్‌తో తప్పనిసరిగా గెలవాల్సిన మూడో టీ20లో భారత్ తలపడేందుకు సిద్ధమైన తరుణంలో మంగళవారం గయానాలో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఇది జరిగింది. ప్రస్తుతం వీడియో మాత్రం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి.
