ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఇవాళ కన్నుమూశారు.
న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ సోమవారం నాడు మరణించారు.1967-1979 మధ్య కాలంలో దిగ్గజ స్పిన్నర్ భారత్ తరపున 67 టెస్టులు ఆడారు.తన కెరీర్ లో 266 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
ఎర్రపల్లి ప్రసన్న, బేడీ, బీఎస్ చంద్రశేఖర్ , ఎస్. వెంకటరాఘవన్ లతో భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో విప్లవానికి నాంది పలికారు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1975 వన్డే ప్రపంచకప్ లో తూర్పు ఆఫ్రికాను 120 పరుగులకు పరిమితం చేయడంలో బిషన్ సింగ్ బేడీ కీలకంగా వ్యవహరించారు. అమృత్ సర్ లో బిషన్ సింగ్ బేడీ జన్మించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో 370 మ్యాచ్ లలో 1,560 వికెట్లతో భారతీయులతో ప్రముఖ వికెట్ టేకర్ గా నిలిచాడు.