కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయాన్ని టీమిండియా క్రికెటర్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారిలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముందు వరసలో ఉంటాడు. లాక్ డౌన్ కి ముందు తన ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పి షాకింగ్ కి గురిచేసిన హార్దిక్.. లాక్ డౌన్ సమయంలో తాను తండ్రి కాబోతున్నానంటూ మరో న్యూస్ చెప్పాడు. 

ఆ తర్వాత తన ప్రేయసి నటాషాతో సమయం గుడుపుతున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచేవాడు. కొద్ది రోజుల క్రితం తన ఫిట్నెస్ లెవల్స్ ని ఓ వీడియో ద్వారా అభిమానులకు పరిచయం చేశాడు. కండలు తిరిగిన శరీరంతో పాండ్యా కఠినమైన వ్యాయామాన్ని సునాయాసంగా చేశాడు. పుష్ అప్స్ చేయడమే కాకుండా.. ఒకచోటు నుండి మరోచోటుకి వెళుతూ చేయడం ఇక్కడ విశేషం. వీడియో చూస్తే పాండ్యా ఫిట్‌నెస్‌ లెవెల్స్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

కాగా.. ఇప్పుడు మరో ఫోటోతో ఆకట్టుకుంటున్నాడు. కిచెన్ లో తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కిచెన్ లో గంటె తిప్పుతూ సందడి చేశాడు. దానికి సంబంధించిన ఫోటో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. హార్దిక్ షేర్ చేసిన ఫోటోకి అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా స్పందిస్తున్నారు.

 

కాగా.. శిఖర్ థావన్ కూడా ఈ ఫోటోకి స్పందించాడు.. ‘‘ భయ్యా.. కచ్చితంగా నువ్వే చేసి ఉంటావు’’ అంటూ కొన్ని ఎమోజీలతో కామెంట్ చేశాడు. కాగా.. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.