Asianet News TeluguAsianet News Telugu

AB De Villiers: హమ్మయ్యా.. బౌలర్లకు పెద్ద ఉపశమనం..! ఏబీడీ రిటైర్మెంట్ పై సన్ రైజర్స్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rashid Khan: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ క్రికెట్ వీడ్కోలు పలకడంపై పలువురు క్రికెటర్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. మిస్టర్ 360తో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. 

Big Relief For bowlers, Tweets Rahsid Khan after AB De Villiers Retirement
Author
Hyderabad, First Published Nov 20, 2021, 1:20 PM IST

దక్షిణాఫ్రికా  మాజీ క్రికెటర్.. ఐపీఎల్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడి నిన్న అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన ఏబీ డివిలియర్స్  (AB De Villiers)కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన మిస్టర్ 360..తాజాగా ఐపీఎల్ తో పాటు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఆర్సీబీ అభిమానులకు ఇది నిజంగా గుండె పగిలే  వార్తే. ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి (Virat kohli) కూడా ఏబీడీ నిర్ణయంతో తన హృదయం గాయమైనంత పనైందని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా అఫ్గానిస్థాన్ స్పిన్నర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్ (Rashid Khan) కూడా ఏబీడీ రిటైర్మెంట్ పై స్పందించాడు. ఏబీడీ రిటైర్మెంట్.. తనలాంటి బౌలర్లకు పెద్ద ఉపశమనం వంటిదని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన రషీద్ ఖాన్.. ‘ఇది (ఏబీడీ రిటైర్మెంట్ నిర్ణయం) కచ్చితంగా నాతో పాటు ప్రపంచ బౌలర్లందరికీ పెద్ద ఉపశమనం.  మరిచిపోలేని జ్ఞాపకాలు అందించడంతో పాటు నాతో పాటు చాలా మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. మేము నిన్ను కచ్చితంగా మిస్ అవుతన్నాం. మిస్ యూ 360..’ అని పేర్కొన్నాడు. 

 

ఐపీఎల్ లో డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడినా  ఇతర జట్ల లోని ఆటగాళ్లు కూడా అతడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రాంచైజీతో  సంబంధం లేకుండా ఏబీడీ.. భారత్ లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక డివిలియర్స్ రిటైర్మెంట్ పై ఆర్సీబీ జట్టు ఆటగాడు..  అతడి సహచరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) కూడా స్పందించాడు. 

ఇదీ చదవండి : AB De Villiers: గుండె ముక్కలయ్యింది బ్రదర్.. ఐ లవ్ యూ! డివిలియర్స్ వీడ్కోలుపై జాన్ జిగ్రీ ఫ్రెండ్ స్పందనిదే..

మ్యాక్సీ స్పందిస్తూ.. ‘ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన ఆటగాడితో పాటు అద్భుతమైన వ్యక్తితో ఫీల్డ్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. క్రికెట్ గతిని మార్చిన ఆటగాడు అతడు.. లెజెండ్..’ అంటూ ట్వీట్ చేశాడు. 

 

కాగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏబీ..‘ఇది ఒక అద్భుమైన ప్రయాణం.. చిన్నప్పుడు పెరట్లో మా సోదరులతో కలిసి క్రికెట్ ఆడినప్పట్నుంచి  ఇప్పటిదాకా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. కానీ 37 ఏళ్ల  వయసులో ఒకప్పటి కసితో ఆడలేకపోతున్నాను. నాకు సహకరించిన యాజమాన్యాలకు, సహచరులకు ధన్యవాదాలు. ఎక్కడికెళ్లినా నన్ను ఆదరించిన అభిమానులకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను..’ అని పేర్కొన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios