Asianet News TeluguAsianet News Telugu

WTC ఫైనల్‌కి 3 రోజుల ముందు ఆస్ట్రేలియాకి ఊహించని షాక్.. గాయంతో కీ బౌలర్ అవుట్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి జోష్ హజల్‌వుడ్‌ని తప్పించిన ఆస్ట్రేలియా... గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌ మధ్యలో నుంచి తప్పుకున్న జోష్ హజల్‌వుడ్...

 

big blow for Australia, Josh Hazlewood is ruled out of  WTC23 Final against India CRA
Author
First Published Jun 4, 2023, 5:29 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 7 నుంచి ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి మూడు రోజుల ముందు ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు..

కొంతకాలంగా మోకాలు, మడమ గాయంతో బాధపడుతున్న జోష్ హజల్‌వుడ్‌, ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా చాలా మ్యాచులకు దూరంగా ఉన్న జోష్ హజల్‌వుడ్, మూడు మ్యాచులు ఆడి గాయం తిరగబెట్టడంతో టీమ్‌కి దూరమయ్యాడు...

జోష్ హజల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడతాడని కొన్ని రోజుల క్రితం ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఫైనల్ మ్యాచ్‌కి మూడు రోజుల ముందు  నిర్వహించిన పరీక్షల్లో కూడా హజల్‌వుడ్ గాయం తగ్గకపోవడంతో రిస్క్ చేయడం ఇష్టం లేక అతన్ని జట్టు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా...

దీంతో జోష్ హజల్‌వుడ్, ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్లబోతున్నాడు. ఈ నెలలో జరిగే యాషెస్ సిరీస్‌ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటే తిరిగి ఇంగ్లాండ్‌కి వస్తాడు. జోష్ హజల్‌వుడ్ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ మైకేల్ నేసర్‌‌ని , స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులో నుంచి తుది జట్టులో చోటు కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా..

33 ఏళ్ల మైకేల్ నేసర్ ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తరుపున 2 టెస్టులు, 2 వన్డేలు మాత్రమే ఆడాడు. 2 టెస్టుల్లో 7 వికెట్లు తీసిన మైకేల్ నేసర్, వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది ప్యాట్ కమ్మిన్స్‌ కరోనా బారిన పడడంతో 2021 యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు ఆడిన నేసర్, 2022 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు...

ఐపీఎల్ 2013 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కి ఆడిన మైకేల్ నేసర్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022-23లో 5 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి అదరగొట్టాడు. బ్యాటుతో సెంచరీ కూడా బాదిన మైకేల్ నేసర్, ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకుంటాడా? అనేది అనుమానమే...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆస్ట్రేలియా జట్టు ఇది: డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్,  అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, స్కాట్ బోలాండ్, మార్కస్ హారీస్, జోష్ ఇంగ్లీష్, నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ, మైకేల్ నేసర్, మిచెల్ స్టార్క్

 

Follow Us:
Download App:
  • android
  • ios