టీ20 ప్రపంచకప్ లో భారత వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. టీ 20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా భువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 23) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో షాహిన్ ఆఫ్రిదిని ఔట్ చేసిన భువీ.. తన 86వ టీ20 వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

తర్వాత ఈ అరుదైన ఘనతను భువీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు టీ20 మ్యాచ్ లు ఆడిన భువనేశ్వర్ 86 వికెట్లు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (85)పేరిట ఉండేది. తాజా మ్యాచ్ తో చాహల్ రికార్డును భువీ బ్రేక్ చేశాడు. ఇక ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాక్ పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 

మిమ్మల్ని పట్టించుకునేవాడెవడూ లేడిక్కడ.. పోయి పని చూసుకోండి : ట్రోలర్స్‌కు భువీ భార్య కౌంటర్

ఈ విజయంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలను చేర్చాడు. 

ఇదిలా ఉండగా, వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. t20 ప్రపంచకప్-2022లో విండీస్ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు కూడా ధ్రువీకరించింది. కాగా ఈ ఏడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తర్వాత సిమన్స్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ‘వెస్టిండీస్ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు.. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచ కప్ లో మా జట్టు ప్రదర్శన కరీబియన్ అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణ కోరుతున్నాను.

ఆస్ట్రేలియాతో టెస్ట్ తరువాత వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను’ అని విలేకరుల సమావేశంలో సిమన్స్ పేర్కొన్నాడు. కాగా, 2016లో టి 20 ప్రపంచకప్ ను విండీస్ కైవసం చేసుకోవడంలో సిమన్స్ కీలక పాత్ర పోషించాడు.

ఈ ఏడాది ప్రపంచ కప్ లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్ వన్ లో విండీస్ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్, స్కాట్లాండ్ లాంటి వంటి పసికూనల చేతిలో కూడా విండీస్ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక 20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శనపై పూర్తిస్థాయి సమీక్ష జరుపుతామని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ ప్రకటించినసంగతి తెలిసిందే. మరోవైపు కెప్టెన్ నికోలస్ పూరన్ పై కూడా వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.