MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మిమ్మల్ని పట్టించుకునేవాడెవడూ లేడిక్కడ.. పోయి పని చూసుకోండి : ట్రోలర్స్‌కు భువీ భార్య కౌంటర్

మిమ్మల్ని పట్టించుకునేవాడెవడూ లేడిక్కడ.. పోయి పని చూసుకోండి : ట్రోలర్స్‌కు భువీ భార్య కౌంటర్

Bhuvneshwar Kumar: కొద్దిరోజులుగా భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమవుతున్నాడు.  ఆసీస్ తో మ్యాచ్ లో  4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడంతో అతడిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్  వెళ్లువెత్తుతున్నాయి.  

1 Min read
Author : Srinivas M
Published : Sep 22 2022, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేలవ ఫామ్ కారణంగానే భారత్ గత మూడు మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో విఫలమైందని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెళ్లువెత్తుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆసీస్ తో మ్యాచ్ లో  అక్షర్ పటేల్ తప్ప బౌలర్లందరూ విఫలమైనా భువీని టార్గెట్ చేసి  ట్రోల్స్ చేయడంపై ఆయన భార్య  నుపుర్ నగర్ ఫైర్ అయింది.  ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రోలర్స్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ట్రోల్స్  చేసేవాళ్ల గురించి పట్టించుకునేవారెవరూ లేరని, తమను విమర్శించే సమయాన్ని మీ జీవితం బాగు కోసం పెట్టండని ఘాటుగా రాసుకొచ్చింది. 

36

ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో నుపుర్ స్పందిస్తూ.. ‘ఈ రోజుల్లో చాలా మంది  పనికిరానివారు. వాళ్లు ఏం చేయరు. కానీ  ద్వేషం, అసూయ ను వ్యాప్తి చేయడానికి మాత్రం వాళ్ల దగ్గర టైం ఉంది. వారందరికీ నా సలహా ఏంటంటే.. 

46

మీ మాటల వల్ల ఇక్కడ ఎవరూ ప్రభావితం కారు. అంతేగాక మీ ఉనికి గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. కావున దయచేసి ఇతరుల మీద ద్వేషం చూపే సమయాన్ని మీ జీవితాలను బాగు చేసుకోవడం మీద పెట్టండి. అది చాలా కష్టమే అనుకోండి. కానీ ట్రై చేయండి..’ అని పేర్కొంది. 

56

భువనేశ్వర్ గత మూడు మ్యాచ్ లలో  డెత్ ఓవర్లలో దారుణంగా విఫలమవుతున్నాడు.  ఆసీస్ తో మ్యాచ్ లో  4 ఓవర్లు  బౌలింగ్ చేసి ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. 17, 19వ ఓవర్ బౌలింగ్ చేసి ఆ ఓవర్లలో 15, 16 పరుగులిచ్చాడు.  

66

భువీ ఆటపై  సునీల్ గవాస్కర్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. సీనియర్ బౌలర్ అయిన భువీ ఇలా బౌలింగ్ చేస్తే ఎలా..? అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక సోషల్ మీడియాలో భువీ మీద మీమ్స్ , ట్రోల్స్  హోరెత్తుతున్న నేపథ్యంలో నుపుర్ నగర్ పై విధంగా స్పందించింది. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved