Asianet News TeluguAsianet News Telugu

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై కోట్లల్లో బెట్టింగ్.. రూ.5.42 కోట్ల పందెం వేసిన ర్యాపర్ డ్రేక్

T20 World Cup 2024, IND vs PAK: భారత్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇరు జట్లు తమ రెండో గేమ్‌ను ఆడుతున్నాయి. భారత్ తమ మునుపటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలుపొందగా, పాకిస్తాన్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ పై బెట్టింగ్ జోరు ఊపందుకుంది. 

Betting in crores on India-Pakistan match Rapper Drake bets Rs 5.42 crore, T20 World Cup 2024 RMA
Author
First Published Jun 9, 2024, 12:05 PM IST

T20 World Cup 2024, IND vs PAK: భారత్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇరు జట్లు తమ రెండో గేమ్‌ను ఆడుతున్నాయి. భారత్ తమ మునుపటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలుపొందగా, పాకిస్తాన్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ పై బెట్టింగ్ జోరు ఊపందుకుంది. 

T20 World Cup 2024, IND vs PAK : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో జ‌ర‌గ‌బోయే భారత్-పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్ కు ముందు గెలుపు వ్యూహాలు, జట్టు కూర్పులు, ఆటగాళ్ల మ్యాచ్ లు తదితర అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం త‌ర్వాత చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. దీంతో క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, గత రికార్డుల గమనిస్తే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ క‌ప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు గతంలో ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆరు సార్లు భార‌త్ గెలిచింది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా vs పాకిస్తాన్ లు న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. భారత్ vs పాకిస్థాన్  మ్యాచ్ జూన్ 9 ఆదివారం రాత్రి 8 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ల బ్యాటింగ్ -  పాకిస్తాన్ 150+ వేగం బౌలింగ్...ఈ బిగ్ ఫైట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ పై బెట్టింగ్స్ భారీగానే జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్స్ కు సంబంధించి కొన్ని రిపోర్ట్ లు పేర్కొంటున్న అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.  వేలు లక్షలు కాదు కోట్లల్లో బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం. 

ర్యాపర్ డ్రేక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను బాస్కెట్ బాల్, రగ్బీ, అమెరికన్ ఫుట్ బాల్ వంటి వివిధ రకాల క్రీడలపై బెట్టింగ్ లకు ప్రసిద్ది చెందాడు. ఈ 37 ఏళ్ల రాపర్ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 2,50,000 డాలర్ల బెట్టింగ్ వేసి తన తొలి క్రికెట్ పందెం వేశాడు. కేకేఆర్ విజయం సాధించినప్పుడు డ్రేక్ 4,50,000 డాలర్లు గెలుచుకున్నాడు. క్రికెట్ లో తన తొలి విజయంతో ఊపుమీదున్న ఈ 'గాడ్స్ ప్లాన్' సింగర్ ఇప్పుడు జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్- పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఈసారి భారీగానే బెట్టింగ్ వేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా అతనే వెల్లడించాడు. డ్రేక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో భారత జట్టుపై 650,000 డాలర్లు పందెం వేసినట్లు వెల్లడించాడు, అంటే సుమారు రూ .5.42 కోట్లు. భారత్ గెలిస్తే డ్రేక్కు రూ.7.6 కోట్లకు సమానమైన 9,10,000 డాలర్లు లభిస్తాయి. ఇది మనకు తెలిసిన బెట్టింగ్.. కానీ ఇంతకు మించి కోట్లల్లో బెట్టింగ్ జరుగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios