పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్... చేతి వేలు విరగడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, చేతి వేలు విరగడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.

రియాన్ పరాగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు డైవ్ చేసిన బెన్ స్టోక్స్, ఎడమ చేతి వేలికి గాయమైంది. స్కానింగ్‌లో చేతి వేలి ఎముక విరిగిందని తేలడంతో బెన్ స్టోక్స్, ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి ఆటగాడిగా దూరం కానున్నాడు.

Scroll to load tweet…

అయితే ఐపీఎల్ 2021 సీజన్ ముగిసేవరకూ జట్టుతోనే ఉండి, సపోర్ట్ చేయబోతున్నాడు బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ గాయం కారణంగా తప్పుకోవడంతో టీ20 నెం.1 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్స్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.