Asianet News TeluguAsianet News Telugu

పక్కకు తప్పుకుని పదేండ్లైనా పవర్ తగ్గలే.. ప్లైట్‌లో క్రికెట్ దేవుడి ఎంట్రీ.. ‘సచిన్.. సచిన్’ అంటూ నినాదాలు

Sachin Tendulkar: భారత్ లో క్రికెట్ ను ఓ మతంగా భావిస్తే  ఆ మతానికి ఆరాధ్య దైవం  సచిన్ టెండూల్కర్ అని చెప్పడానికి  సందేహించక్కర్లేదు.  సుదీర్ఘకాలంపాటు భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా మారిన సచిన్   క్రికెట్ నుంచి  2013లో తప్పుకున్నాడు. 

Be It  On or Off The Field  The chants of Sachin Sachin  is Continue, Tendulkar  gets God Like  Reception, Watch video
Author
First Published Dec 19, 2022, 2:28 PM IST

సచిన్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని పేరు. రెండున్నర దశాబ్దాల పాటు భారత క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా మారిన  ఈ క్రికెట్ దేవుడి ప్రయాణం  ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.  సచిన్ ఆడుతున్న సమయంలో అతడు బ్యాటింగ్ కు క్రీజులోకి వస్తుంటే  స్టేడియంలో ఉన్న అభిమానులంతా.. ‘సచిన్.. సచిన్..’ అని అరిచేవారు.  ఇక ఫోర్, సిక్స్ కొడితే ఆ హంగామా మాములుగా ఉండేది కాదు. అయితే  సచిన్ క్రికెట్ నుంచి తప్పుకుని పదేండ్లు కావస్తున్నది.  2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.  సచిన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా ఇప్పటికీ  అతడు ఎక్కడ కనిపించినా.. ‘సచిన్.. సచిన్’ నామస్మరణ మార్మోగుతూనే ఉంటుంది. 

తాజాగా  సచిన్  ఓ విమానంలో ముంబైకి వస్తుండగా అక్కడ ప్రయాణీకులంతా అతడిని చూడగానే ఉబ్బితబ్బిబ్బయ్యారు.  టెండూల్కర్ కనబడగానే.. ‘సచిన్.. సచిన్’ అని అరిచారు.   ఇందుకు సంబంధించిన  వీడియోను అదే విమానంలో ఉన్న ఓ  నెటిజన్  ట్విటర్ లో షేర్ చేశాడు. 

వీడియోను షేర్ చేస్తూ సదరు నెటిజన్.. ‘ఇది ఇప్పుడే  నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్ లో జరిగింది.  ఆన్ ది ఫీల్డ్ అయినా ఆఫ్ ది ఫీల్డ్ అయినా ‘సచిన్.. సచిన్’  నినాదాలు ఎప్పటికీ మారవు. అవి మా హృదయంలో ఎప్పటికీ నిలిచేఉంటాయి..’అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కు సచిన్ స్పందించాడు. సదరు నెటిజన్ షేర్ చేసిన పోస్టును పంచుకుంటూ.. ‘థ్యాంక్యూ..  ఇది నాకు  నేను  క్రికెట్ ఆడినప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన రోజులను గుర్తుచేసింది. అయితే  సీట్ బెల్ట్ రూల్ వల్ల నేను లేచి నిలబడలేకపోయాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను. అందరికీ థ్యాంక్యూ,  అందరికీ హాయ్..’ అని  ట్వీట్ చేశాడు.  

 

సచిన్   స్పందనపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘వన్స్ ఎ లెజెండ్ ఆల్వేస్ లెజెండ్..’, ‘లెజెండ్, లార్జర్ దెన్ లైఫ్, గాడ్ ఫర్ ఎ రీజన్’, ‘సార్ మీరు ఎక్కడ కనబడ్డా మాది ఇదే ఫీలింగ్. అది మా నరనరాల్లో ఇంకిపోయింది. ఇన్నాళ్లుగా మీరు ఇచ్చిన స్ఫూర్తి,  ఆట పట్ల మీకున్న ప్యాషన్, మీతో మాకు ఉండే ఎమోషన్ మా నుంచి విడదీయలేనివి.  ఇది ఎప్పటికీ మారదు.  సచిన్.. సచిన్ అనేది మా జీవితాల్లో ఓ భాగం..’ అని భావోద్వేగంగా స్పందించాడు.  

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios