ముంబై: ఆస్ట్రేలియాతో నేడు సిరీస్ లో చివరి మ్యాచ్ ముగియగానే భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. ఆ పర్యటన కోసం వాస్తవానికి నేడు జట్టు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. 

ఇలా జట్టు ప్రకటనను వాయిదా వేయడానికి బలమైన కారణం లేకపోలేదు. హార్దిక్ పాండ్య ఇంకా ఫిట్నెస్ సాధించని కారణంగా ఈ జట్టు ప్రకటన ఆలస్యం అయితుందని తెలియవస్తుంది. 

Also read: పని ఎక్కువయిందని అందరూ బాధపడుతుంటే... పనిలేక బాధపడుతున్న ఉమేష్

న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 5 టి 20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచులను ఆడనుంది. ప్రస్తుతం టి 20 కోసం ఎంపిక చేయబోయే జట్టును రానున్న టి 20 ప్రపంచ కప్ ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయనున్న నేపథ్యంలో హార్దిక్ ఫిట్నెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

జాతీయ క్రికెట్ అకాడెమి గనుక హార్దిక్ కి టి 20లు ఆడేందుకు పచ్చ జెండా ఊపితే.... అతడిని సెలెక్ట్ చేసేందుకు బీసీసీఐ వెయిట్ చేస్తోంది. అతడు పూర్తి ఫిట్నెస్ గనుక సాధిస్తే అతడిని తీసుకోవడానికి చూస్తుంది టీం మానేజ్మెంట్. 

న్యూజిలాండ్ లోని పిచ్చులు ఆస్ట్రేలియాలోని పిచ్చులు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. దానితో ఈ సిరీస్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వారి వారి ప్రపంచ కప్ బెర్తులు ఖరారవుతాయి. 

Also read; ద్రవిడ్ కన్నా రాహుల్ మెరుగైన వికెట్ కీపర్, కానీ....

అందుకోసం హార్దిక్ పాండ్య కోసం ఇంతలా వెయిట్ చేస్తోంది టీం మానేజ్మెంట్. ఇప్పటికే పాండ్య క్రికెట్ మైదానంలో అడుగుపెట్టి చాలా కాలం అయింది. సర్జరీ తరువాత అతను పూర్తి స్థాయిలో కోలుకున్నప్పటికీ, మ్యాచ్ ఫిట్నెస్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాడు. 

ఒకవేళ హార్దిక్ పాండ్య గనుక ఫిట్నెస్ సాధించలేని పక్షంలో అతడి స్థానంలో హార్డ్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ ను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో అద్భుత ఫామ్ లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ను ఖచ్చితంగా ఎంపిక చేయనున్నారు. 

న్యూజిలాండ్ పిచ్ ల పరిస్థితులకు అనుగుణంగా మూడవ స్పిన్నర్ బదులు నవదీప్ సైనీని ఎంపిక చేసే అవకాశాలు మెండు. ఇక వన్డేల విషయానికి వచ్చేసరకు 2023 వరల్డ్ కప్ ప్రణాళికలోని లేని కేదార్ జాదవ్ ను ఈ సిరీస్ కు ఎంపిక చేసే ఛాన్స్ తక్కువగా ఉంది.