భారత పురుషుల క్రికెట్ జట్టు వరుస విజయాలతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళితే, మహిళల జట్టు మాత్రం ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడి ఏడేళ్లు అయ్యింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది టెస్టు మ్యాచ్ ఆడనుంది భారత జట్టు.

ఇంగ్లాండ్‌తో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడుతుందని ప్రకటించాడు బీసీసీఐ సెక్రటరీ జే షా. భారత వన్డే సారథి మిథాలీసేన సారథ్యంలో చివరిసారిగా 2014లో సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా.

2006 నుంచి మూడు టెస్టులు ఆడిన టీమిండియా, మూడింట్లోనూ గెలిచింది. ఇప్పుడు వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు గెలిస్తే, వరుసగా నాలుగు టెస్టులు గెలిచిన ఏకైక జట్టుగా నిలుస్తుంది భారత జట్టు...