విరాట్ కోహ్లీ గైర్హజరీలో భారత జట్టును అద్భుతంగా నడిపించిన తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానేపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తుతోంది. ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ సొంతం చేసుకుని అద్భుతం చేసిన భారత జట్టు... ఈ విజయన్ని మరిచిపోలేకపోతుంది. తాజాగా గబ్బా టెస్టు విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ అజింకా రహానే మాట్లాడిన స్పీచ్‌ను పోస్టు చేసింది బీసీసీఐ...

‘ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఎందుకంటే ఈ విజయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యారు... అందరికీ థ్యాంక్స్’... అంటూ చెప్పిన రహానే... ‘టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయానా కుల్దీప్ యాదవ్, ఎంతో సానుకూల దృక్పథంతో జట్టుతో కొనసాగాడు.

అవకాశం రాకపోయినా అతను చూపిన పాజిటివ్ స్పిరిట్ జట్టుకి చాలా ఎనర్జీని ఇచ్చింది. స్వదేశంలో టెస్టు సిరీస్‌లో నీకు కచ్ఛితంగా ఛాన్స్ వస్తుంది... కార్తీక్ త్యాగి... నెట్స్‌లో చాలా అద్భుతంగా చేశాడు. ఫ్యూచర్‌లో మంచి స్టార్ అవుతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు.

టెస్టు సిరీస్‌లో రిజర్వు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్, కార్తీక్ త్యాగిల గురించి కూడా ప్రస్తావించి, అసలు సిసలైన నాయకుడిగా నిరూపించుకున్నాడు రహానే..