Gautam Gambhir : టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్
Gautam Gambhir Team India Head Coach: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలోనే 2011 ప్రపంచ ఛాంపియన్ గౌతమ్ గంభీర్ ను భారత జట్టు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Team India Head Coach Gautam Gambhir : టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త కోచ్‌ని ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత భారత జట్టు గొప్ప కోచ్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలేనే అనేక మంది లెజెండరీ ప్లేయర్ల పేర్లు వినిపించాయి. అయితే, 2011 ప్రపంచ ఛాంపియన్ గౌతమ్ గంభీర్ ఈ రేసులో ముందడుగు వేశారు. ఇప్పుడు ప్రధాన కోచ్‌గా గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియాలో టీమిండియా హెడ్ కోచ్ గురించి సమాచారం అందించారు.
జైషా ఏం చెప్పారంటే..?
టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గురించి వివరాలను బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో గంభీర్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రధాన కోచ్ గా అతనికి స్వాగతం పలికారు. "భారత క్రికెట్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను స్వాగతిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆధునిక కాలంలో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. గౌతమ్ తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా రాణించి అనేక రూపాల్లో తన గొప్ప ప్లేయర్ గా, కోచ్, మెంటర్ గా ఎదిగారని" అన్నారు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గౌతమ్ ఆదర్శమని తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. భారత జట్టు పల్ల అతని స్పష్టమైన దృష్టి, అపార అనుభవం ఈ ఉత్తేజకరమైన, అత్యంత డిమాండ్ ఉన్న కోచింగ్ పాత్రను నిర్వహించడానికి గంభీర్ ను సంపూర్ణంగా సిద్ధం చేశాయనీ, ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి బీసీసీఐ మద్దతుగా ఉంటుందని తెలిపారు.
గౌతమ్ గంభీర్ స్పందన ఇదే..
టీమిండియా ప్రధాన కోచ్ గా బీసీసీఐ అధికారిక ప్రకటన తర్వాత గౌతమ్ గంభీర్ కూడా స్పందిస్తూ దేశానికి ఈ విధంగా సేవ చేయడం చాలా సంతోషంగా ఉంటుందని తెలిపారు. 'భారతదేశం నా గుర్తింపు, నా దేశానికి సేవ చేయడం నా జీవితంలో అతిపెద్ద అదృష్టం. నేను వేరే టోపీని ధరించినప్పటికీ తిరిగి వచ్చినందుకు గర్వపడుతున్నాను. కానీ నా లక్ష్యం ఎప్పటిలాగే, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడం. మెన్ ఇన్ బ్లూ 1.4 బిలియన్ల భారతీయుల కలలను వారి భుజాలపై మోస్తుంది. ఈ కలలను నిజం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను!' అని అన్నారు.
శ్రీలంక టూర్.. టీమిండియాకు కొత్త కెప్టెన్.. పోటీలో ఆ ఇద్దరు.. !