Asianet News TeluguAsianet News Telugu

రిషబ్ పంత్ నుదుటిన రెండు కాట్లు, మోకాలికి గాయం, వీపు భాగంలో... బీసీసీఐ అధికారిక స్టేట్‌మెంట్...

మెలకువలోకి వచ్చిన రిషబ్ పంత్... వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం... రిషబ్ పంత్‌కి అయిన గాయాలతో అధికారిక స్టేట్‌మెంట్ విడుదల చేసిన బీసీసీఐ.. 

BCCI official statement released on Rishabh Pant accident, health condition
Author
First Published Dec 30, 2022, 1:36 PM IST

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్‌ని వెంటనే పక్కనే ఉన్న సాక్ష్యం మల్లీస్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ప్రయాణీకులు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రిషబ్ పంత్‌ని డెహ్రాడూన్‌కి తరలించారు...

డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు రిషబ్ పంత్. మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో రిషబ్ పంత్‌ మెలకువలోకి వచ్చాడని, వైద్యులతో మాట్లాడాడని సమాచారం. అతని తీసిన ఎక్స్‌రేలో ఎలాంటి ఎముక విరగలేదని, ఫ్రాక్చర్స్‌ ఏవీ లేవని తేలింది...

తాజాగా బీసీసీఐ, రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి కూడా బులెటిన్ విడుదల చేసింది. రిషబ్ పంత్‌ నుదుటిన రెండు కాట్లు పడ్డాయని తెలియచేసిన బీసీసీఐ, కుడి మోకాలికి గాయమైందని తెలిపింది. అలాగే అతని కుడి మోచేతికి, పాదానికి, బొటనవేలికి కూడా గాయాలైనట్టు స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది బీసీసీఐ.

కారులో నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో రిషబ్ పంత్ వీపుకి గీసుకుపోయిందని రాసుకొచ్చింది. త్వరలో రిషబ్ పంత్‌కి ఎంఆర్‌ఐ స్కానింగ్ నిర్వహించి, ఆ గాయాల తీవ్రతను అంచనా వేయబోతున్నారు వైద్యులు. స్కానింగ్ రిపోర్టులను బట్టి చేయబోయే ట్రీట్‌మెంట్‌‌ని నిర్ణయిస్తారు...

రిషబ్ పంత్ కుటుంబసభ్యులతో పాటు అతనికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందితో, మెడికల్ టీమ్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలిపిన బీసీసీఐ, మెరుగైన వైద్య సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియచేసింది.. 

కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రిషబ్ పంత్‌. కారు, రోడ్డు డివైడర్‌ని ఢీకొట్టిన 6 నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే అటుగా వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు, కారు ప్రమాదాన్ని గుర్తించారు. ఈ సమయంలో వేగంగా కారు వద్దకి వచ్చిన జనాలు, కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయారట...

న్యూ ఇయర్‌కి తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఇంటికి బయలుదేరిన రిషబ్ పంత్, తల్లిదండ్రుల కోసం, సోదరి కోసం కొన్ని కానుకలు కొనుగోలు చేశాడు. అలాగే రిషబ్ పంత్‌కి ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషబ్ పంత్ కోలుకుని, ఈ విషయంపై నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ రాదు... 

దీంతో ఏం చేయాలో తెలియని రిషబ్ పంత్, అతి కష్టం మీద బయటికి వచ్చి అంబులెన్స్‌కి ఫోన్ చేశాడని తెలుస్తోంది. నిస్సహాయ స్థితిలో రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతంలో రిషబ్ పంత్ పడిపోయాడు. కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్లిపోవడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది...

Follow Us:
Download App:
  • android
  • ios