బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వచ్చే ఏడాది వేసవిలో ఆసియా XI, ప్రపంచ XIతో రెండు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెంది న  క్రికెటర్లు ఆసియా జట్టులో ఉండరని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ తెలిపారు.

ఇదే సమయంలో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. భారత్, పాక్ జట్ల మధ్య ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రక్రియ ఉండదని, అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున ఆడే ఐదుగురి పేర్లను వెల్లడిస్తారని జార్జ్ పేర్కొన్నారు.

Also Read:మీరే ఆడుకుంటే.. మేమంతా ఏమవ్వాలి: గంగూలీపై పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

కాగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. పదేళ్ల తర్వాత పాక్‌లో టెస్ట్ సిరీస్ నిర్వహించడంపై స్పందించిన ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహ్‌సన్ మణి... ప్రస్తుతం పాక్‌లో కన్నా భారత్‌లోనే భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని అన్నారు.

Also Read:'దాదా'గిరి : ద్రావిడ్ పై పెత్తనం, భవిష్యత్తు చిక్కులివే...

ఆ తర్వాతి రోజే పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అగ్రశ్రేణి జట్లతో ప్రతిపాదించిన సూపర్ సిరీస్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని విమర్శించారు. తాజాగా ఆసియా XIలో పాక్ ఆటగాళ్లు ఉండరని జయేశ్ జార్జ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.