T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా కెప్టెన్ అతడే: జై షా
T20 World Cup 2024:టీ-20 ప్రపంచకప్ కోసంక్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా జట్ల వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమిండియాకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు జై షా స్పష్టతనిచ్చేశారు.
T20 World Cup 2024: ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 20 జట్లు పాల్గొనున్న ఈ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ పూర్తి స్థాయిలో షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. సుమారు పదకొండేళ్లుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీమిండియాకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా కీలకం కానున్నది.
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ దూకుడు ప్రదర్శనిచ్చిన భారత్ కు ఫైనల్‍లో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం అండర్ 19 కప్ అయినా వస్తుందనీ ఎదురుచూసిన ఫ్యాన్స్ కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న కసితో టీమిండియా వేచి ఉంది. కానీ.. టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంలో చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా ఈ విషయంలో స్పష్టతనిచ్చేశారు. టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు కెప్టెన్ ఎవరో వెల్లడించారు.
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 ఫార్మాట్ కు దూరమయ్యారు. కేవలం వన్డేలు,టెస్టులకే పరిమితమయ్యారు రోహిత్.. ఈ తరుణంలో జట్టు నాయకత్వం బాధ్యతలు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు అప్పగించారు. అయితే.. ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్‍తో సిరీస్‍తో రోహిత్ శర్మ మళ్లీ భారత్ టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20 ప్రపంచకప్‍లో భారత కెప్టెన్ అంశంలో సందిగ్గత నెలకొంది.
తాజా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు జై షా స్పష్టతనిచ్చారు. టీ20 ప్రపంచకప్‍లో టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మనే కెప్టెన్‍గా ఉంటాడని జై షా స్పష్టం చేశారు. అతడి సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్ పోరులో దిగుతుందనీ, టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంటుందనే నమ్మకం తనకు పూర్తిగా ఉందని తెలిపారు. ఈ టీ-20 ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు.