ముంబై: ప్రస్తుత ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉంటాడా, లేదా అనేది అనుమానంగా ఉంది. టీమింజియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కు లండన్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో హెర్నియా సర్జరీ జరిగిందని బిసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

గత కొంత కాలంగా భువనేశ్వర్ కుమార్ తరుచుగా గాయపడుతూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. తాజాగా అతను వెస్టిండీస్ సిరీస్ లో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. భారత ఫియోజయోథెరపిస్ట్ యోగేశ్వర్ పర్కార్ పర్యవేక్షణలో భువీకి సర్జరీ జరిగిందని, పునరావాస శిక్షణ కోసం త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)లో చేరుతాడని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు.

Also Read: ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు 

అయితే భువనేశ్వర్ కుమార్ కు ఎన్ని రోజులు విశ్రాంతి ఇస్తారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దీంతో భువనేశ్వర్ కుమార్ ఐపిఎల్ ఆడడం ఆనుమానమేనని అంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రధానమైన బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఆయన లేకపోతే జట్టుపై తీవ్రమైన దెబ్బ పడే అవకాశం ఉంది.

ఏడు నెలల నిషేధం, ఆ తర్వాత గాయం కారణఁగా జట్టుకు దూరమైన పృథ్వీషాపై కూడా బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. పృథ్వీ షా గాయం నుంచి కోలుకున్నాడని, ఎన్ సీఏ పునరావాస కేంద్రంలో పూర్తి ఫిట్నెస్ సాధించాడని జైషా చెప్పారు. 

Also Read: వరల్డ్ కప్ సెలబ్రెటీ బామ్మ ఇక లేరు

సెలెక్షన్ కమిటీకి అతను పూర్తి అందుబాటులో ఉంటాడని చెప్పారు. పృథ్వీషా త్వరలో న్యూజిలాండ్ తో జరిగే భారత - ఏ జట్టులో చేరుతాడని ఆయన చెప్పారు.