BCCI Bans On Boria Majumdar: టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన కేసులో  ప్రముఖ క్రీడా జర్నిలిస్టు  బొరియా మజుందార్  పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కఠినంగా వ్యవహరించింది. 

ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బెంగాల్ కు చెందిన బొరియా మజుందార్ పై బీసీసీఐ కఠిన చర్యలకు దిగింది. వెటరన్ క్రికెటర్, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మజుందార్ పై రెండేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బీసీసీఐ కమిటీ అతడిపై రెండేండ్ల పాటు నిషేధాన్ని విధించాలని సూచించింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు పరభ్తేజ్ సింగ్ భాటియాలతో కూడిన త్రిసభ్య కమిటీ.. సాహా ఆరోపణలపై విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది. 

బీసీసీఐ ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘క్రికెట్ ప్టేడియాలకు అతడిని అనుమమతించకూడదని మేము అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు ఆదేశాలిస్తున్నాం. స్వదేశంలో జరిగే మ్యాచులతో పాటు విదేశాల్లో జరుగబోయే సిరీస్ లకు కూడా అతడికి అక్రిడేషన్ ఇవ్వకూడదని నిర్ణయించాం. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లతో పాటు ఐసీసీ కి కూడా ఈ విషయాన్ని విన్నవించాం. బీసీసీఐతో కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్లెవరూ అతడితో ఇంటర్వ్యూ చేయడానికి వీళ్లేదు..’ అని పేర్కొంది. 

Scroll to load tweet…

ఈ ఏడాది ఫిబ్రవరిలో సాహా తన ట్విటర్ వేదికగా మజుందార్ తనను వాట్సప్ చాట్ లో బెదిరించిన మెసేజ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను తీసి పోస్ట్ చేశాడు. తన పోస్ట్ లో ‘ఇన్నాళ్ల పాటు నిస్వార్థంగా భారత జట్టుకు సేవలందించినందుకు నాకు దక్కిన గౌరవం ఇది..’ అని పోస్ట్ చేశాడు. తన తో ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడనే కోపంతో మజుందార్.. సాహాను బెదిరించాడు. దీనిపై భారత క్రికెట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

Scroll to load tweet…

ఇక ఈ వ్యవహారం బీసీసీఐ కి చేరింది. సాహాను బెదిరించిన జర్నలిస్టు పేరు చెప్పాలని అతడికి కఠినంగా శిక్షించాలని భారత క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి ప్రముఖులు అతడికి మద్దతుగా నిలిచారు. ఇక మజుందార్ ను విచారించిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిజాన్ని నిగ్గు తేల్చింది. 

బొరియా పై నిషేధం ఇలా.. 

- రెండేండ్ల పాటు స్టేడియాలలోకి రాకుండా నిషేధం 
- ఈ మేరకు అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ రాయనున్న బీసీసీఐ
- అతడి పాత అక్రిడేషన్ కార్డ్ రద్దు..
- విదేశాలలో జరిగే సిరీస్ లకు కూడా అతడికి మ్యాచులను రిపోర్ట్ చేసే అనుమతి నిరాకరించాలని ఐసీసీకి లేఖ 
- బొరియాతో ముఖాముఖి చేసేందుకు క్రికెటర్లకు అనుమతి లేదు.. 
- బీసీసీఐ తో కాంట్రాక్ట్ లో ఉన్న క్రికెటర్లతో మజుందార్ ఇంటర్వ్యూలు చేయడానికి వీళ్లేదు.