BCCI Awards:భారత మాజీ ఆల్‌రౌండర్, ప్రధాన కోచ్ రవిశాస్త్రిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'తో సత్కరించనుండగా, టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్‌ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించనున్నది. 

BCCI Awards: భారత మాజీ ఆల్‌రౌండర్, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుండగా, టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ ‌ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించనున్నారు. మంగళవారం బీసీసీఐ అవార్డులను ప్రదానం చేయనుంది. ఇది 2019 తర్వాత మొదటిసారి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి భారత్, ఇంగ్లండ్ జట్లు హాజరు కానున్నాయి.

శుభ్‌మన్ గిల్‌ 

గతేడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు గాను టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ (BCCI) అందించే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు దక్కనుంది. 2023లో శుభ్‌మన్‌ అద్భుత ప్రదర్శన కనబరించారు. మూడు ఫార్మాట్లలో కలిపి 52 ఇన్నింగ్స్‌ల్లో 2,154 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే గతేడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 29 వన్డేల్లో 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, ఐదు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టులు, టీ20ల్లో ఒక్కో శతకం బాదాడు. 

Ravi Shastri: రవిశాస్త్రికి లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు 

అదే సమయంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌, భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకుగాను గుర్తుగా ఈ అవార్డును అందిస్తున్నారు. రవిశాస్త్రి భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. అతను వ్యాఖ్యాతగా కూడా చాలా పేరు సంపాదించాడు మరియు రెండుసార్లు భారత జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. అలాగే.. 2014 - 2016 మధ్య జట్టు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత 2021 టీ20 ప్రపంచకప్ వరకు జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగాడు.

రవిశాస్త్రి కోచింగ్ హయాంలో టీమిండియా ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను గెలుచుకుంది. అయితే శాస్త్రి, విరాట్ కోహ్లిల జోడీ మాత్రం భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. అలాగే.. అతని కోచింగ్‌లో భారత్ 2019లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది, అదే సమయంలో భారత్ 2019 ODI ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.