ఆసీస్ పర్యటనలో భారత జట్టు కొత్త జెర్సీలో మెరవనుంది. టీమిండియా కిట్ స్పాన్సర్‌గా మొబైల్ గేమింగ్ యాప్ ఎమ్‌పీఎల్‌ను అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. మూడేళ్ల పాటు కొనసాగే ఈ అగ్రిమెంట్‌లో భాగంగా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో పాటు అండర్-19 భారత జట్లకు కూడా కిట్లను సరాఫరా చేయనుంది ఎమ్‌పీఎల్.

నవంబర్ 2020 నుంచి ప్రారంభమయ్యే ఈ ఒప్పందం డిసెంబర్ 2023తో ముగుస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆసీస్ పర్యటనలో కొత్త జెర్సీలో కనిపించబోతోంది భారత క్రికెట్ జట్టు. విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న ఎమ్‌పీఎల్‌, వంద కోట్లకి పైగా క్రికెట్ అభిమానులున్న భారత జట్టుకి జెర్సీ, కిట్లను స్పాన్సర్ చేయడం గర్వంగా ఉందని ప్రకటించింది.

టీమిండియా కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైక్‌తో 14 ఏళ్లుగా కొనసాగిన ఒప్పందం... ఈ సెప్టెంబరు నెలతో ముగిసింది.