Asianet News TeluguAsianet News Telugu

2023-24 హోమ్ సీజన్‌లో భారత్ పాల్గొనే సిరీస్‌లు ఇవే .. బీసీసీఐ ప్రకటన, ఏయే జట్లతో అంటే..?

2023-24 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మంగళవారం టీమ్ ఇండియా పాల్గొనబోయే సిరీస్‌ల షెడ్యూల్స్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్‌లతో భారత జట్టు తలపడనుంది. 

BCCI announces Indias international fixtures for home season in 2023-24 ksp
Author
First Published Jul 25, 2023, 8:48 PM IST

2023-24 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మంగళవారం టీమ్ ఇండియా పాల్గొనబోయే సిరీస్‌ల షెడ్యూల్స్‌ను ప్రకటించింది. 5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20 సిరీస్‌లో కలిపి మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్‌లను భారత జట్టు ఆడనుంది. 2023లో వన్డే ప్రపంచకప్‌కు ముందు సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఆస్ట్రేలియాతో భారత్ స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. మొహాలి, ఇండోర్, రాజ్‌కోట్‌లలో ఈ సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత .. ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20లలో భారత్ తలపడనుంది. ఈ సిరీస్ నవంబర్ 23న ప్రారంభమై డిసెంబర్ 3న ముగుస్తుంది. 

కొత్త ఏడాదిలో ఆఫ్ఘనిస్తాన్‌.. తొలిసారిగా భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ కోసం పర్యటించనుంది. ఈ సందర్భంగా మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. మొహాలీ, ఇండోర్‌, బెంగళూరులలో ఈ సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్ 2024 జనవరి 25న ప్రారంభమై మార్చి 11న ముగియనుంది. ఈ సందర్భంగా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్, వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. 

ఇండియా హోమ్ సీజన్ 2023-24 షెడ్యూల్:

భారత్ vs ఆస్ట్రేలియా (ODIలు)

1వ ODI: సెప్టెంబర్ 22, మొహాలీ
2వ ODI: సెప్టెంబర్ 24, ఇండోర్
3వ ODI: సెప్టెంబర్ 27, రాజ్‌కోట్ 

ఆస్ట్రేలియా  vs భారత్ (T20Iలు)

1వ T20I: నవంబర్ 23, వైజాగ్
2వ T20I: నవంబర్ 26, త్రివేండ్రం
3వ T20I: నవంబర్ 28, గౌహతి
4వ T20I: డిసెంబర్ 1, నాగ్‌పూర్
5వ T20I: డిసెంబర్ 3, హైదరాబాద్

భారత్ vs ఆఫ్ఘనిస్తాన్

1వ టీ20: జనవరి 11, మొహాలీ
2వ T20I: జనవరి 14, ఇండోర్
3వ టీ20: జనవరి 17, బెంగళూరు

భారత్ vs ఇంగ్లాండ్

1వ టెస్టు: జనవరి 25-29, హైదరాబాద్
2వ టెస్టు: ఫిబ్రవరి 2-6,     వైజాగ్  
3వ టెస్టు: ఫిబ్రవరి 15-19, రాజ్‌కోట్
4వ టెస్టు: ఫిబ్రవరి 23-27, రాంచీ
5వ టెస్టు: మార్చి 7-11,     ధర్మశాల
 

Follow Us:
Download App:
  • android
  • ios