ఇంగ్లాండ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుస సీరిస్ లను ఆడనుంది. ప్రపంచ కప్ తర్వాత టీమిండియా దాదాపు ఆరు నెలల పాటు ఆడనున్న ద్వైపాక్షిల సీరిస్ ల షెడ్యూల్ బిసిసిఐ తాజాగా ప్రకటించింది. అయితే ఈ షెడ్యూల్ ఆంధ్ర ప్రదేశ్ అభిమానులను సంతృప్తి పర్చగా తెలంగాణ క్రికెట్ ప్రియులను మాత్రం కాస్త నిరాశకు గురిచేసింది. 

2019-20 సంవత్సరాల్లో ఆరునెలల పాటు సాగనున్న టీమిండియా మ్యాచుల్లో కేవలం ఒకే ఒకటి హైదరాబాద్ కు వేదికవనుంది. అదికూడా ఓ టీ20 మ్యాచ్. ఇదే క్రమంలో  మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ స్టేడియం రెండు మ్యాచులకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పొందింది. ఇలా కేవలం ఒక్క మ్యాచ్ తో సరిపెట్టుకోవాల్సి రావడంతో తెలంగాణ అభిమానులు నిరాశ చెందగా...ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ ప్రియులు మాత్రం బిసిసిఐ నిర్ణయంతో సంతృప్తిచెందారు. 

మొత్తంగా ప్రపంచ కప్ ముగిసిన తర్వాత 2019 సెప్టెంబర్ నుండి 2020 మార్చి వరకు టీమిండియా స్వదేశంలో ఐదు దేశాలతో ఆరు సీరిసుల్లో పాల్గొననుంది. ఇలా  వివిధ దేశాలతో 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టీ20 మ్యాచుల్లో భారత్‌ తలపడనుంది.  


ఫ్రీడమ్‌ ట్రోఫీ-2019 సెప్టెంబర్ 15- అక్టోబర్ 23 వరకు ( దక్షిణాఫ్రికాతో)
 

 సెప్టెంబర్ 15 : ఫస్ట్ టీ20- ధర్మశాల

సెప్టెంబర్18 :సెకండ్ టీ20- మొహాలి

సెప్టెంబర్22 : థర్డ్ టీ20- బెంగళూరు

అక్టోబర్ 2-6  :  ఫస్ట్  టెస్ట్ - వైజాగ్ 

అక్టోబర్ 10-14 : సెకండ్ టెస్ట్ - రాంచీ

అక్టోబర్ 19-23 : థర్డ్ టెస్ట్ - పూణే 

భారత్ లో బంగ్లాదేశ్ పర్యటన (నవంబర్ 3 నుండి నవంబర్ 26 వరకు) 


నవంంబర్ 3: ఫస్ట్ టీ20 - డిల్లీ

నవంబర్ 7; సెకండ్ టీ20 - రాజ్ కోట్ 

నవంబర్ 10: థర్డ్ టీ20 - నాగ్ పూర్ 

నవంబర్ 14-18 : ఫస్ట్ టెస్ట్ - ఇండోర్

నవంబర్ 22-26 : సెకండ్ టెస్ట్ - కోల్‌కతా

 

భారత్ లో వెస్టిండిస్ పర్యటన (డిసెంబర్ 6 - డిసెంబర్ 22) 

డిసెంబర్ 6: ఫస్ట్ టీ20 - ముంబయి

డిసెంబర్ 8: సెకండ్ టీ20 - తిరువనంతరపురం

డిసెంబర్ 11: మూడో టీ20 - హైదరాబాద్ 

డిసెంబర్15:  :ఫస్ట్ వన్డే - చెన్నై

డిసెంబర్ 18: సెకండ్ వన్డే- వైజాగ్

డిసెంబర్22: థర్డ్ వన్డే -  కటక్ 

 
భారత్ లో జింబాబ్వే  పర్యటన ( జనవరి 5- జనవరి 10)
 
జనవరి 5: ఫస్ట్ టీ20 - గౌహతి

జనవరి 7; సెకండ్ టీ20 - ఇండోర్ 

జనవరి10: థర్డ్ టీ20 - పూణే


భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన ( జనవరి 14 -జనవరి 19 వరకు)

జనవరి 14: ఫస్ట్ వన్డే - ముంబై 

జనవరి 17: సెకండ్ వన్డే - రాజ్ కోట్ 

జనవరి19: థర్డ్ వన్డే - బెంగళూరు 


భారత్ లో సౌతాఫ్రికా పర్యటన  ( మార్చ్ 12-మార్చ్ 18 వరకు)

మార్చి 12 : ఫస్ట్ వన్డే - ధర్మశాల

మార్చి 15: సెకండ్  వన్డే - లక్నో

మార్చి 18: థర్డ్ వన్డే - కోల్‌కతా