2023-24 సీజన్ (అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు) కోసం టీమిండియా (సీనియర్ మెన్) వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. 

2023-24 సీజన్ (అక్టోబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు) కోసం టీమిండియా (సీనియర్ మెన్) వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

గ్రేడ్ A+ (నలుగురు ఆటగాళ్లు)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా.

Scroll to load tweet…

గ్రేడ్ A (ఆరుగురు ఆటగాళ్లు)

రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ , హార్దిక్ పాండ్యా

Scroll to load tweet…

గ్రేడ్ B (ఐదుగురు ఆటగాళ్లు)

సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్

Scroll to load tweet…

గ్రేడ్ సి (15 మంది ఆటగాళ్లు )

రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, KS భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్ , రజత్ పటీదార్. 

Scroll to load tweet…

అదనంగా.. నిర్దేశిత వ్యవధిలో కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 T20Iలు ఆడాలనే ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అథ్లెట్లు ఆటోమేటిగ్గా, ప్రో-రేటా ఆధారంగా గ్రేడ్ Cలో చేర్చబడతారు. ఉదాహరణకు.. ధృవ్ జురెల్ , సర్ఫరాజ్ ఖాన్, ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. వారు ధర్మశాల టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటే గ్రేడ్ Cలోకి చేర్చబడతారు. అంటే, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోని 5వ టెస్టు.

Scroll to load tweet…

ఈ రౌండ్ సిఫార్సులలో వార్షిక కాంట్రాక్టుల కోసం శ్రేయాస్ అయ్యర్ , ఇషాన్ కిషన్‌లను పరిగణించబడలేదని గమనించండి. సెలక్షన్ కమిటీ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లను ఆకాష్ దీప్, విజయ్ కుమార్ వైషాక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వాత్ కావేరప్ప. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో అథ్లెట్లందరూ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీసీఐ సిఫార్సు చేసింది.