టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఆటలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ 2020 సూపర్ డూపర్ హిట్టు కావడంతో బిగ్‌బాష్ లీగ్ 2020 సీజన్‌ను మొదలెట్టింది ఆస్ట్రేలియా. ఓ వైపు ఆసీస్, టీమిండియా జట్లు టెస్టు సిరీస్ కోసం రెఢీ అవుతుండగానే... టీ20 అభిమానులను అలరిస్తోంది బీబీఎల్ 2020.

తాజాగా మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. కాన్‌బెర్రాలో జరిగిన ఈ మ్యాచ్‌లో డానియల్ సామ్స్‌ వేసిన ఓ ఫుల్ టాస్ డెలివరీ... నేరుగా వచ్చి బ్యాటింగ్ చేస్తున్న నిక్ లార్కిన్ షర్టులోకి దూరిపోయింది. బంతిని ఫేస్ చేయడంలో మిస్ అయిన లార్కిన్... బాల్ ఎక్కడుంతో తెలియకుండానే సింగిల్ కోసం పరుగు తీశాడు.

లార్కిన్ సగం దూరం వచ్చిన తర్వాత బంతి, మెల్లిగా షర్టులో నుంచి బయటపడింది. ఈ సంఘటనతో లార్కిన్‌తో పాటు అందరూ నవ్వేశాడు. లార్కిన్ కావాలనే బంతిని దాచేశాడని ప్రత్యర్థి బౌలర్ అంపైర్‌ వైపు చూసినా... అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని తేల్చిన అంపైర్ సింగిల్ ఇచ్చాడు.