Asianet News TeluguAsianet News Telugu

సానియా మీర్జా కొడుక్కి జ్వరం... బంగ్లాదేశ్‌తో జరిగే ఆఖరి టీ20 నుంచి షోయబ్ మాలిక్ అవుట్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్... మొదటి రెండు టీ20ల్లో గెలిచి, సిరీస్ కైవసం... మూడో మ్యాచ్‌కి షోయబ్ మాలిక్ దూరం...

Bangladesh vs Pakistan: Shoaib Malik going to miss third t20I with Bangladesh with family Issues
Author
India, First Published Nov 22, 2021, 2:41 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా,పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి, పెళ్లాడిన విషయం తెలిసిందే. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది సానియా మీర్జా. ఆ సమయంలో తల్లి ఆడే ప్రతీ మ్యాచ్‌కి వెళ్లి, తెగ సందడి చేశాడు ఇజాన్ మీర్జా మాలిక్. టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ ఆడిన మ్యాచుల్లోనూ సానియా మీర్జా, కొడుకుతో కలిసి కనిపించింది...

ఇదీ చదవండి: వాళ్లు ఫైనల్ ఆడి ఇక్కడికి వచ్చారు, సిరీస్ క్లీన్ స్వీప్ చేసినా... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ తర్వాత ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది పాకిస్తాన్. ఇప్పటికే మొదటి రెండు టీ20ల్లో గెలిచి, సిరీస్ సొంతం చేసుకున్న పాక్, నవంబర్ 22న మూడో టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్‌కి దూరంగా ఉంటున్నట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ప్రకటించాడు. 

ఇజాన్ మీర్జా మాలిక్ జ్వరంతో బాధపడుతుండడంతో టీ20 సిరీస్ మధ్యలోనే బంగ్లా నుంచి దుబాయ్‌కి పయనం కానున్నాడు షోయబ్ మాలిక్. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది, టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఫాస్టెస్ట్ అర్ధశతకం నమోదు చేసిన పాక్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు షోయబ్ మాలిక్...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మొదట ప్రకటించిన జట్టులో షోయబ్ మాలిక్‌కి చోటు దక్కలేదు. అయితే టోర్నీ ఆరంభానికి ముందు పాక్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మక్సూద్ గాయపడడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు మాలిక్...

ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, పాక్ జట్టుకి విజయాన్ని అందించిన షోయబ్ మాలిక్, సెమీ ఫైనల్‌లో 1  పరుగుకే అవుట్ అయ్యాడు. టీ20 వరల్డ్‌ కప్ టోర్నీ తర్వాత 39 ఏళ్ల షోయబ్ మాలిక్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని టాక్ వినిపంచినా, అలాంటి నిర్ణయం తీసుకోలేదు...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో భారత జట్టుపై విజయాన్ని అందుకున్న పాకిస్తాన్, ఐసీసీ వరల్డ్‌ కప్ టోర్నీల్లో టీమిండియాకి ఉన్న రికార్డును 12-1 తేడాతో తగ్గించగలిగింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘనిస్తాన్‌లపై ఈజీ విజయాలు అందుకున్న పాక్, గ్రూప్ 2లో ఐదుకి ఐదు విజయాలు అందుకుని ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో సూపర్ 12 రౌండ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచిన పాకస్తాన్, సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో హసన్ ఆలీ, మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను డ్రాప్ చేశాడు...

Read: అతని బ్యాటింగ్ డిస్సపాయింట్ చేసింది, తన రేంజ్‌కి తగ్గట్టుగా ఆడలేదు... రిషబ్ పంత్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్స్...

ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన మాథ్యూ వేడ్‌, మ్యాచ్‌ని ముగించాడు. పాక్‌ను ఓడించి, రెండోసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా... ఆఖరాటలో కివీస్‌ను ఓడించి, మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios