బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్, ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ ఆలీపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మొయిన్ ఆలీ క్రికెటర్ కాకపోయి ఉంటే, టెర్రరిస్ట్ అయ్యేవాడు’ అంటూ తస్లీమా నస్రీన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది.

తస్లీమా నస్రీన్, మొయిన్ ఆలీని టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడుతున్న మొయిన్ ఆలీ, ఓ అల్కహాల్ బ్రాండ్ లోగోను జెర్సీపై ధరించడానికి ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి.

తస్లీమా కామెంట్లకి ఇదే కారణమా? లేక మరేదైనా ఉందనేది తెలీదు. అయితే ముస్లింగా పుట్టినంత మాత్రాన టెర్రరిస్ట్ అవుతారా? అంటూ తస్లీమా నస్రీన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.