Asianet News TeluguAsianet News Telugu

Pushpa: క్రికెటర్లను తాకిన పుష్ఫ ట్రెండ్... వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా ‘తగ్గేదేలే’ అంటూ ఫోజులు

Bangladesh bowler copies Allu Arjun: ఇప్పటికే డేవిడ్ వార్నర్ తో పాటు రవీంద్ర జడేజా.. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్ ను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అనుకరించిన వీడియోలు అవుతుండగా తాజాగా...
 

Bangladesh bowler Nazmul Islam copies Allu Arjun's Pushpa Move as celebration of Wicket
Author
Hyderabad, First Published Jan 23, 2022, 3:05 PM IST

తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ కథానాయకుడిగా లాజికల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా రూపొందిన ఈ చిత్రం  ఇప్పటికే విడుదలై కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నది. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లలో ఈ సినిమాకు సంబంధించిన డైలాగులు, పాటలు, డాన్సులు దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా విడుదలై ఈపాటికే నెల రోజులు దాటిపోయినా.. సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సినిమాలో ఎంతో పాపులర్ అయిన ‘తగ్గేదే లే’ ఫోజు, ‘చూపే బంగారమాయే..’ పాట ఇప్పుడు క్రికెట్ లో కూడా ట్రెండ్ సెట్టర్.  బౌలర్ వికెట్ తీసినా.. బ్యాటర్ సిక్సర్ కొట్టినా ఇదే ఫోజు.. 

ఇప్పటికే డేవిడ్ వార్నర్ తో పాటు రవీంద్ర జడేజా.. పుష్ప సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్ ను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అనుకరించిన వీడియోలు  ట్రెండింగ్ అయ్యాయి. ఇక తాజాగా బంగ్లాదేశ్  బౌలర్ నజ్ముల్ ఇస్లాం కూడా.. ఈ  ట్రెండ్ ను అనుకరించాడు.

 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో భాగంగా శనివారం కోమిల్లా విక్టోరియన్స్, శైలెట్ సన్ రైజర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో విక్టోరియన్స్ బౌలర్ నజ్ముల్ ఇస్లాం.. ప్రత్యర్థి జట్టులోని షోహిదుల్ ఇస్లాంను ఔట్  చేశాడు.  అతడిని ఔట్ చేయగానే నజ్ముల్.. ‘తగ్గేదేలే..’ ఫోజును అనుకరించాడు.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైలర్ గా మారింది. 

 

గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా.. ‘తగ్గేదే లే..’, ‘యే బిడ్డా, ఇది నా అడ్డ..’ లను అనుకరిస్తూ వీడియోలు చేశాడు. వార్నరే కాదండోయ్.. తాజాగా అతడి కూతుర్లు కూడా ‘సామి.. సామి’ పాటకు స్టెప్పులేశారు. రెండ్రోజుల క్రితం వార్నర్.. ‘చూపే బంగారమాయే’ పాటకు సంబంధించిన హుక్ స్టెప్ ను అనుకరిస్తూ వీడియో చేశాడు. ఈ వీడియోకు అల్లు అర్జున్ కూడా లైక్ కొట్టిన విషయం తెలిసిందే. 

 

వార్నర్, జడేజాలు మాత్రమే కాదు.. గతంలో టీమిండియా క్రికెటర్లు  సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా ‘చూపే బంగారమాయేనే’ పాటకు  స్టెప్పులేశారు. తాజాగా సురేశ్ రైనా కూడా తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఈ వీడియోను  ఉంచాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios