NZ vs BAN 1st T20: న్యూజిలాండ్ కు బంగ్లాదేశ్ షాక్..
Bangladesh vs New Zealand: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ సంచలనాలు నమోదుచేస్తోంది. టెస్టు, వన్డే సిరీస్ లలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. చారిత్రాత్మక మొదటి టీ20 విజయాన్ని నమోదు చేసింది.
Bangladesh vs New Zealand 1st T20I : కీవీస్ టూర్ లో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ లలో సంచలన విజయాలు సాధించింది. ప్రస్తుత ఆడుతున్న టీ20 సిరీస్ లో కూడా న్యూజిలాండ్ కు బంగ్లా షాక్ ఇచ్చింది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా బుధవారం నేపియర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపియర్ లో కీవీస్ పై తొలి వన్డే విజయం సాధించిన నాలుగు రోజుల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ కు ఇదే తొలి టీ20 విజయం కావడం విశేషం.
బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బంగ్లా కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఆకట్టుకుంది. కీవీస్ జట్లు 10 ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయింది. జేమ్స్ నీషమ్ 48 పరుగులు, మిచెల్ సాంట్నర్ 23 పరుగులతో రాణించారు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం 3, మహేదీ హసన్ 2, ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు తీశారు.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 18.4 ఓవర్లలో 137 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లిటన్ దాస్ 42* పరుగులు, సౌమ్య సర్కార్ 22 పరుగులతో బంగ్లా విజయం కీలక పాత్ర పోషించారు. కీవీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ లు తలా ఒక వికెట్ తీశారు.
రాక్ సాలిడ్ డిఫెన్స్, సూపర్ బౌండరీలతో అదరగొట్టిన కేఎల్ రాహుల్..