ఏడాది నిషేధం తర్వాత తిరిగి క్రికెట్ ఎంట్రీ ఇచ్చాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ఏడాది బ్యాన్ తర్వాత కూడా రీఎంట్రీ ఇచ్చినా ఆల్‌రౌండర్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు షకీబ్. స్వతహాగా ముస్లిం అయిన షకీబ్ అల్ హాసన్.. ఈ మధ్య కోల్‌కత్తాకి వచ్చి. కలకత్తాకాళీ మాతను దర్శించుకున్నాడు.

ముస్లిం అయి వుండి హిందువుల గుడికి వెళ్లడం సహించలేకపోయిన కొందరు మత ఛాందసవాసులు, షకీబ్ అల్ హసన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఈ విధంగా బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది. సెల్హెట్ ఏరియాకు చెందిన మోహ్‌సిన్ తాలుకదుర్... ఢాకాకి వెళ్లి షకీబ్‌ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని తీవ్రపదజాలంతో బెదిరించాడు.

కేసు నమోదుచేసుకున్న పోలీసులు, ఫేస్‌బుక్ వీడియో లింక్ ద్వారా నిందితుడిని గుర్తించారు. దీంతో షకీబ్ అల్ హసన్‌కు క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేశాడు సదరు వ్యక్తి. కాళీమాత పూజకు హాజరయ్యేననే వార్తల్లో నిజం లేదని, కాళీమాజ గుడికి వెళ్లిన మాట నిజమేకానీ ఎలాంటి పూజలు చేయలేదని క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశాడు షకీబ్.