Asianet News TeluguAsianet News Telugu

టీ20 సీరిస్ సమం: డికాక్ వన్ మ్యాచ్ షో... బెంగళూరు టీ20లో కోహ్లీసేన చిత్తు

భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ 1-1తో ముగిసింది. తాజాగా బెంగళూరు వేదికన జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని  అందుకుంది. మొదట బౌలర్లు కోహ్లీసేనను 134 పరుగులకే కట్టడిచేశారు. ఆ తర్వాత కెప్టెన్ డికాక్ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సఫారీ జట్టును గెలిపించాడు. అతడికి హెన్రిక్స్(28 పరుగులు), బవుమా(19 పరుగులతో  నాటౌట్) ల నుండి చక్కటి సహకారం అందింది. దీంతో సౌతాఫ్రికాటీం16.2 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి మాత్రమే లక్ష్యాన్ని  ఛేదించింది.  ఆ ఒక్క వికెట్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.

bangalore t20: india vs south africa third t20 updates
Author
Bangalore, First Published Sep 22, 2019, 6:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ 1-1తో ముగిసింది. తాజాగా బెంగళూరు వేదికన జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 లో సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో రాణించి విజయాన్ని  అందుకుంది. మొదట బౌలర్లు కోహ్లీసేనను 134 పరుగులకే కట్టడిచేశారు. ఆ తర్వాత కెప్టెన్ డికాక్ 79 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సఫారీ జట్టును గెలిపించాడు. అతడికి హెన్రిక్స్(28 పరుగులు), బవుమా(19 పరుగులతో  నాటౌట్) ల నుండి చక్కటి సహకారం అందింది. దీంతో సౌతాఫ్రికాటీం16.2 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి మాత్రమే లక్ష్యాన్ని  ఛేదించింది.  ఆ ఒక్క వికెట్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.

 బెంగళూరు టీ20లో సఫారీ బౌలర్లు అదరగొట్టారు. టీమిండియా బ్యాాటింగ్ లైనప్ ని బెంబేలెత్తించి కేవలం 134 పరుగులకే పరిమితం చేశారు. రబడ 3, ఫార్చ్యూన్ 2, హెన్రిక్స్ 2, శంషీ 1 వికెట్ పడగొట్టారు.

భారత బ్యాాట్స్ మెన్స్ లో ధవన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక రిషబ్ పంత్ 19,రవీంద్ర జడేజా 19, హార్దిక్ పాండ్యా 14  పరుగులతో పరవాలేదనిపించారు. మిగతావారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. దీంతో సౌతాఫ్రికా ముందు కోహ్లీసేన కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వుంచగలిగింది. 

సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. ఐదు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోకి జారుకున్న సమయంంలో  కృనాల్ పాండ్యా(4  పరుగులు) కూడా వికెట్ చేజార్చుకున్నాడు. అతడుహెన్రిక్స్ బౌలింగ్ లో 98 పరుగుల వద్ద ఔటయ్యాడు.   

 జట్టును ఆదుకుంటారనుకున్న యువ ఆటగాళ్లు రిషబ్ పంత్(19 పరుగులు), శ్రేయాస్ అయ్యర్(5 పరుగులు) లు కూడా చేతులెత్తేశారు. ఫార్చ్యూన్ వేసిన ఒకే ఓవర్లో వీరిద్దరు పెవిలియన్ కు చేరుకున్నారు.  

బెంగళూరు టీ20లో భారత టాప్ ఆర్డర్ తడబడింది.ఓపెనర్ రోహిత్(9 పరుగులు) ఔటయిన వెంటనే అతడి స్థానంలో బరిలోకి దిగిన  కోహ్లీ కూడా పెవిలియన్ కు చేరాడు.అతడు కూడా కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రబడ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వేగంగా ఆడుతూ స్కోరు వేగాన్ని పరుగులెత్తించిన మరో ఓపెనర్ ధవన్ (36 పరుగులు 25 బంతుల్లో) కూడా మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో భారత్ 68 పరుగులకే మూడు టాప్ వికెట్లు కోల్పోయింది. 

 స్వదేశంలో జరుగుతున్న టీ20 సీరిస్ విజయానికి కోహ్లీసేనకు నిరాశ తప్పలేదు. మొహాలీ టీ20 విజయం ద్వారా 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా బెంగళూరులో మాత్రం ఓడిపోయింది.దీంతో  1-1తేడాతో సీరిస్ సమమయ్యింది. 

చివరి టీ20 కోసం నిర్వహించిన టాస్ ను టీమిండియా గెలుచుకుంది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సఫారీలకు టాస్  కలిసిరాకపోవడంతో ముందుగా బౌలింగ్ చేసి ఆ తర్వాత ఛేదనకు దిగాల్సివస్తోంది. 

''చిన్నస్వామి స్టేడియంలో లక్ష్యఛేదనే సులభమన్న విషయం నాకు కూడా  తెలుసు. కానీ టీ20 ప్రపంచ కప్ ప్రయోగాల్లో  భాగంగానే ఈ  నిర్ణయం తీసుకున్నా. మా జట్టు బలాబలాలను, ఆటగాళ్ళ  సామర్థ్యాన్ని  తెలుసుకునేందుకే ఈ ప్రయోగం. ముఖ్యంగా  ప్రతికూల పరిస్థితుల్లో  కూడా ఫలితాన్ని అనుకూలంగా ఎలా రాబట్టాలో తెలుసుకునేందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా. '' అని కోహ్లీ తన నిర్ణయం గురించి వివరణ ఇచ్చుకున్నాడు. 

తుది జట్లు:

టీమిండియా:

రోహిత్  శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషిగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, 

సౌతాఫ్రికా:

క్వింటన్ డికాక్(కెప్టెన్, వికెట్ కీపర్), రీజా హెన్రిక్స్, బవుమా,  వాండర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో, ఫ్రిటోరియస్, ఫార్చ్యూన్, కగిసో రబడ, హెన్రిక్స్, షంషీ

Follow Us:
Download App:
  • android
  • ios