22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన బెయిర్ స్టో...ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించిన బెయిర్ స్టో... 

జానీ బెయిర్ స్టో తనలోని రియల్ పవర్ హిట్టింగ్‌ను బయటితీసుకొచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 151 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మెరుపు ఆరంభం అందించాడు బెయిర్ స్టో. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన బెయిర్ స్టో, క్రీజులో ఉన్నంతసేపు ముంబై బౌలర్లకు చెమటలు పట్టించాడు.

ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టిన బెయిర్ స్టో, మిల్నే వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు రాబట్టాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బెయిర్ స్టో కొట్టిన ఓ సిక్సర్‌ ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టాండ్స్‌లో ఉన్న ఫ్రిజ్ అద్దం పగిలిపోయింది.

Scroll to load tweet…

అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో హిట్ వికెట్‌గా అవుటై పెవిలియన్ చేరాడు బెయిర్ స్టో. మనీశ్ పాండే ఫెయిల్ కాగా డేవిడ్ వార్నర్ రనౌట్ కావడంతో 90 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..