IPL 2023: బుధవారం నాటి మ్యాచ్ లో  కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు.   32 బంతులాడిన అతడు 39 పరుగులే చేశాడు. ఇదే కాదు ఐపీఎల్-16లో రాహుల్ ఆట దరిద్రంగా ఉందని ఫ్యాన్స్ కూడా వాపోతున్నారు. 

ఐపీఎల్-16 లో బుధవారం రాజస్తాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో లక్నో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో ఓడిపోతే బాగుండని కోరుకుంటున్నాడట మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్. కెఎల్ రాహుల్ చెత్త ఆడట చూడటం ఇష్టం లేక మ్యాచ్ ఓడిపోతే అయినా ఆ బాధ తప్పుతుందని భావించాడట. ఈ విషయాన్ని ఆయన లక్నో - రాజస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే ట్వీట్ లో వెల్లడించడం గమనార్హం. 

నిన్నటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ జిడ్డు బ్యాటింగ్ తో విసిగించాడు. 32 బంతులాడిన అతడు 39 పరుగులే చేశాడు. ఇదే కాదు ఐపీఎల్-16లో రాహుల్ ఆట దరిద్రంగా ఉందని ఫ్యాన్స్ కూడా వాపోతున్నారు. టీ20లను మరీ టెస్టుల కంటే దారుణంగా ఆడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై దొడ్డ గణేష్ కూడా స్పందించాడు. 

లక్నో - రాజస్తాన్ మ్యాచ్ లో లక్నో బ్యాటింగ్ ముగిశాక ఆయన తన ట్విటర్ లో ‘కెఎల్ రాహుల్ ఇదే తరహాలో చెత్త ఆట ఆడితే మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు రావడం మంచిది. 2018లో మాదిరిగా దూకుడుగా ఆడే విధానంలో ఆడితే తప్ప అతడు ఓపెనర్ గా వచ్చి వేస్ట్. మరీ ఇంత బోరింగ్ గా అసలు ఆట మీద ఆసక్తే లేనట్టుగా ఆటను మారుస్తున్నాడు..’అని ట్వీట్ చేసిన ఆయన కొద్దిసేపటికి మరో ట్వీట్ కూడా చేశాడు. ‘లక్నో నాలుగైదు మ్యాచ్ లను ఓడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు గానీ రాహుల్ బ్యాటింగ్ చేసే విధానం మారదు. లక్నో ఓడిపోతే అయినా అతడు తన విధానాన్ని మార్చుకుంటాడేమో..’ అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

కాగా రాహుల్ చెత్త బ్యాటింగ్ పై ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ కూడా ఘాటుగానే స్పందించాడు. రాజస్తాన్ తో మ్యాచ్ జరుగుతుండగా కామెంట్రీ బాక్స్ లో .. ‘పవర్ ప్లే లో రాహుల్ బ్యాటింగ్ చూస్తే పరమ బోరింగ్ గా ఉంది. నేనైతే ఇంత చెత్త ఎప్పుడూ చూడలేదు’ అని బహిరంగంగానే వాపోయాడు. మొత్తంగా ఇప్పటివరకు ఈ సీజన్ లో 6 మ్యాచ్ లు ఆడి 194 పరుగులు చేసిన రాహుల్ స్ట్రైక్ రేట్ 114. 79 మాత్రమే. ఐపీఎల్-16లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన టాప్ -15 బ్యాటర్లలో 11 వ స్థానంలో ఉన్న రాహుల్ స్ట్రైక్ రేట్ మాత్రమే అందరికంటే తక్కువగా (114.79) నమోదైంది. ఇక ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కెఎల్ ను ఆటాడేసుకుంటున్నారు. 

Scroll to load tweet…