Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్ 2022 : అంపైర్ పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం అసహనం.. ‘కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను’ అంటూ సైగలు...

ఆసియాకప్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ కెప్టెన్ అంపైర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. 

Babar Azam fumes at umpire after accepts Mohd Rizwans DRS call
Author
First Published Sep 10, 2022, 12:06 PM IST

ఆసియా కప్-2022లో భాగంగా ఆఖరి సూపర్ ఫోర్ మ్యాచ్లో పాకిస్థాన్ కు శ్రీలంక షాకిచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హాసన్ అలీ బౌలింగ్లో  ఓ బౌన్సర్ బంతిని షనక కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్ళింది. అయితే బంతి బ్యాట్ కి తగిలిందని భావించిన రిజ్వాన్ కీపర్ క్యాచ్ కు అప్పీల్ చేశాడు. 

పాక్‌పై లంకదే తొలి విజయం... విజయంతో ఆసియా కప్ 2022 ఫైనల్‌కి...

దాన్ని ఫీల్డ్ అంపైర్  అనిల్ చౌదరి మాత్రం తిరస్కరించాడు. ఈ క్రమంలో రిజ్వాన్ రివ్యూ కోసం అంపైర్ కు సిగ్నల్ చేశాడు. అంపైర్ వెంటనే రివ్యూ కోసం థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేశాడు. అయితే,  బంతి బ్యాట్ కు తాకలేదని రిప్లేలో తేలింది. దీంతో అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది.  సాధారణంగా ఏ ఫార్మాట్ లోనైనా కెప్టెన్  రివ్యూకి సిగ్నల్ చేస్తేనే..  ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ కి రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కెప్టెన్ తో సంబంధం లేకుండా వికెట్-కీపర్ సూచనల మేరకు అంపైర్ రివ్యూకి రిఫర్ చేయడం గమనార్హం.

ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్  బాబర్ ఆజాం అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను’ అంటూ బాబర్ అంపైర్ కు  సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో టైటిల్ కోసం పాకిస్తాన్-- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios