David Warner helicopter: డేవిడ్ వార్నర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో హెలికాప్టర్ లో దిగాడు. క్రికెట్ ఆడేందుకు హెలికాప్టర్ తో స‌హా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో డేవిడ్ వార్న‌ర్ దిగిన ఈ వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదే సమయంలో దీని ఖర్చులు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి.  

David Warner Land via helicopter: ఇటీవ‌ల పాకిస్తాన్ తో త‌న చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఈ మధ్య ఏం చేసినా నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇదే క్ర‌మంలో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వార్న‌ర్ కు సంబంధించిన ప‌లు దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ విష‌యం తెలిస్తే మీరు కూడా ఔరా ! అంటూ ఆశ్చ‌ర్య‌పోతారు ! డేవిడ్ వార్నర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో హెలికాప్టర్ లో దిగాడు. అది కూడా క్రికెట్ మ్యాచ్ ఆడ‌టం కోసం ఏకంగా హెలికాప్ట‌ర్ తీసుకుని దానితో పాటు గ్రౌండ్ లోనే దిగి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీనికి బిగ్ బాష్ లీగ్ నేప‌థ్యంలో ఇది జ‌రిగింది. డేవిడ్ వార్న‌ర్ క్రికెట్ గ్రౌండ్ లో హెలికాప్ట‌ర్ తో ల్యాండింగ్ అయిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. 

Scroll to load tweet…

అయితే, డేవిడ్ వార్నర్ తన సోదరుడి వివాహానికి హాజరైన తర్వాత హెలికాప్టర్ లో నేరుగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)కి చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శుక్రవారం బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. టెస్టు, వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ థండర్ తరఫున ఆడేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చారు.

IND VS PAK: క్రేజీ బ‌జ్.. భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్.. బిగ్ ఫైట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించేనా!

టెస్టు రిటైర్మెంట్ తర్వాత డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో సిడ్నీ థండర్ జట్టు తరఫున మూడు మ్యాచ్లు ఆడనుండగా.. సిక్సర్స్ తో జ‌రిగిన మ్యాచ్ కూడా ఒక‌టి. సిడ్నీ థండర్ ఫాస్ట్ బౌలర్, వార్నర్ సహచరుడు గురిందర్ సంధు మాట్లాడుతూ "డేవిడ్ మా కోసం వచ్చి ఆడటానికి చాలా కష్టపడుతున్నాడు. అతను ఇక్కడ ఉండటం మాకు చాలా ఇష్టం. గత ఏడాది అతను మా కోసం అద్భుతంగా ఆడాడు, అతను కోరుకున్నన్ని పరుగులు చేయలేకపోవచ్చు, కానీ జట్టులో ఉండటం బాగుటుంది.. జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అభిమానులంతా తమ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తారు'' అని తెలిపాడు. 

ఇదే త‌ర‌హాలో.. 

గతంలో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండ్రీ నెల్ కూడా ఇదే తరహాలో గ్రౌండ్ కు వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించారు. 2004 జనవరి 16న సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. జనవరి 17న ఆండ్రీ నెల్ వివాహం జరగాల్సి ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రీ నెల్ వివాహాన్ని విడిచిపెట్టలేదు లేదా మ్యాచ్ నుంచి త‌ప్పుకోలేదు. పెండ్లి కోసం నేరుగా క్రికెట్ గ్రౌండ్ లో హెలికాప్ట‌ర్ ఎక్కి పెండ్లి చేసుకోవ‌డానికి వెళ్లాడు.

కలలో పాము కనిపిస్తే అర్థమేంటి..? శుభమా.. అశుభమా..?