రాజ్ కోట్: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్ లో కోహ్లీసేన మొదటి విజయాన్ని అందుకుంది. మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా రెండో వన్డేలో మరింత పట్టుదలతో విజయాన్ని అందుకుంది. రాజ్ కోట్ లో జరిగిన  ఈ  హోరాహోరీ పోరు అభిమానులకు పసందయిన వన్డే మజాను అందించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసిస్ ముందుంచింది. అయితే ఈ లక్ష్యాన్ని ఆసిస్ జట్టు కాస్త కంగారుపడుతూనే చేధించినంత పని చేసింది. అయితే ఆ జట్టు ఇన్నింగ్స్ 49.1 ఓవర్లలో 304 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ 36 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

భారత బౌలర్లలో  షమీ 3, రవీంద్ర జడేజా 2, కుల్దీప్ యాదవ్ 2, సైనీ 2, బుమ్రా 1 వికెట్ పడగొట్టారు. ఆసిస్ ఆటగాళ్లలో స్మిత్ 98 పరుగులతో సెంచరీని మిస్సయ్యాడు. లబుచాగ్నే 46, ఫించ్ 33, అగర్ 25 పరుగులతో రాణించినా జట్టును గెలిపించుకోలేకపోయారు. 

 చివర్లో నిలదొక్కుకోడానికి ప్రయత్నించిన అగర్(25 పరుగులు)) ను సైనీ పెవిలియన్ కు పంపించాడు. అదే ఓవర్లో స్టార్క్ ను కూడా ఔట్ చేసి టీమిండియాను విజయానికి మరింత చేరువ చేశాడు. 

భారత బౌలర్ మహ్మద్ షమీ హ్యాట్రిక్ ఛాయిస్ ను కొద్దిలో మిస్సయ్యాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టిన అతడు మూడో బంతికి వికెట్ రాబట్టలేదు. అయినప్పటికి కీలక సమయంలో వరుసగా ఇద్దరు ఆసిస్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపి భారత్ను విజయానికి మరింత చేరువచేశారు. మొదట టర్నర్ (13 పరుగులు) ను ఔట్ చేసి ఆ తర్వాత బంతికే కమ్మిన్స్ ను డకౌట్ చేశాడు. దీంతో ఆసిస్ 268 పరుగులకు ఏడు వికెట్లు  కోల్పోయింది.

భారత విజయావకాశాలకు గండికొట్టేలా కనిపించిన స్మిత్ ఎట్టకేలకు సెంచరీ మిస్సయ్యాడు. కుల్దీప్ యాదవ్ విసిరిన  ఓ అద్భుతమైన బంతికి బోల్తాపడ్డ అతడు సెంచరీకి రెండు పరుగులు దూరంలో నిలిచి పెవిలియన్ బాటపట్టాడు. ఇదే ఓవర్లో మొదట క్యారీ(18 పరుగులు) ఔటయ్యాడు. ఇలా కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టడంతో ఆసిస్ 227 పరుగులవద్ద ఐదు వికెట్లు కోల్పోయింది.  

కీలక సమయంలో ఆసిస్ మరో వికెట్ కోల్పోయింది. స్మిత్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆసిస్ ను లక్ష్యఛేదన  దిశగా నడిపించిన లబుచాగ్నే 46 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఔటయ్యాడు. దీంతో ఆసిస్ 178 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన ఆసిస్ కష్టాల్లోకి జారుకుంటున్న సమయంలో స్మిత్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. భారత  బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. దీంతో 22 ఓవర్లలో ఆసిస్ 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బెంబేేలెత్తిస్తున్నారు. ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయిన కంగారు జట్టుకు రవీంద్ర జడేజా బౌలింగ్ లో మరో ఝలక్ తగిలింది. ఓపెనర్ ఫించ్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఔటయ్యాడు. దీంతో ఆసిస్ 82 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 

భారత్ విధించిన 341 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షమీ షాకిచ్చాడు. షమీ విసిరినా బంతిని ఆడిన వార్నర్ మనీష్ పాండే అందుకున్న అద్భుత క్యాచ్ వల్ల పెవిలిన్ కు చేరుకున్నాడు. మనీష్ పాండే పట్టిన క్యాచ్ వల్ల ఒక్క సారిగా రాజ్ కోట్ మైదానంలో కరతాళ ధ్వనులతో మార్మోగింది. 

కెప్టెన్ ఫించ్ తో కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నారు. గత మ్యాచులో వీర విహారం చేసిన వార్నర్ ఇప్పుడు ఇలా తక్కువ పరుగులకే ఔటవ్వడంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఒక్కసారిగా సైలెన్స్ నెలకొంది. ఆస్ట్రేలియాకు ఉన్న డీప్ బ్యాటింగ్ లైన్ అప్ వల్ల ఒక్క వికెట్ కె వచ్చిన ప్రమాదం ఏమి లేదు. కాకపోతే భారీ స్కోర్ స్కోర్ బోర్డు మీద ఉండడం వల్ల ఆ ప్రెషర్ ని తట్టుకోలేక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ త్వరగా వికెట్లను చేజార్చుకునే ఆస్కారం ఉంది. 

ఇక భారత ఇన్నింగ్స్ లో రాహుల్ తన క్లాస్ ఇన్నింగ్స్ తో చెలరేగి కేవలం 52 బంతుల్లోనే 80 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగా ఔటయ్యాడు.  భారత్ ఇన్నింగ్స్ లో తడబడుతున్న వేళా రాహుల్ కొట్టిన 80 పరుగుల పుణ్యమాని 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

అంతకు ముందు వరకు విరాట్ కోహ్లీ, రాహుల్ ల జోడి బాగానే ఆడినప్పటికీ, కోహ్లీ ఔటవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మనీష్ పాండే కూడా ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసాడు. ఇక ఆ తరువాత వచ్చిన జడేజా తో కలిసి రాహుల్ భారత్ ఇన్నింగ్స్ ధాటిని పెంచాడు. వేగంగా పరుగులువై సాధిస్తూ..స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. 

రాహుల్ ఏ స్థానంలో ఆడగలనని నిరూపించుకొని భారత్ టీం లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  

ఇకపోతే, టీం ఇండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ మరోమారు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ జాంప చేతిలోనే ఔటయ్యాడు. 78 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద  జాంప బౌలింగులో ఔటయ్యాడు. 

నాలుగోస్థానం కోసం టీం ఇండియా ఎప్పటినుంచో ఒక సొల్యూషన్ గా భావిస్తున్న శ్రేయాస్ అయ్యర్ మరోసారి నిరాశపరిచాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రమాదకరంగా పరిణమించిన స్పిన్నర్ జాంప బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

అతని తరువాత 5వ నుమ్బెర్స్లో రాహుల్ బ్యాటింగ్ కు వచ్చాడు. రాహుల్ వచ్చి రావడంతోనే ఒక ఫోర్ బాధి తాను మంచి ఫామ్ లోనే ఉన్నానని సందేశం ఇచ్చాడు. 

ఓపెనర్ శిఖర్ ధావన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. కేన్ రీచర్డ్సన్ బౌలింగ్ లో స్టార్క్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత స్కోర్ 185/2. ధావన్ ఔటయిన తరువాత శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. 

ఇకపోతే మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో భారత్ 81 పరుగుల వద్ద ఔటయ్యాడు

రాజకోట్‌ మైదానంలో బౌండరీ లెంగ్త్ చాలా తక్కువ. ఈ చిన్న బౌండరీల మైదానంలో భారీ హిట్టర్లు విశ్వరూపం ప్రదర్శిస్తారనటంలో  ఎటువంటి సందేహం అవసరం లేదు. దానికి తోడు రాత్రి వేళా మంచు ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇలా ఫీల్డింగ్ ఎంచుకున్నారు.  

Also read; కంగారూల లెక్క సరిచేసేనా....?

ప్లేయింగ్ ఎలెవన్

భారత్‌ : శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్‌, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా. 

ఆస్ట్రేలియా : అరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారి, అగర్, ఆష్టన్‌ టర్నర్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా.