Asianet News TeluguAsianet News Telugu

తీవ్ర భావోద్వేగ వ్యాఖ్యలు: విమర్శకుల నోళ్లు మూయించిన రిషబ్ పంత్

ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టు మ్యాచులో విజయం సాధించిన తర్వాత టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనకు ఇది డ్రీమ్ సిరీస్ అని అన్నాడు.

Australia vs India: Rishab Pant feels It is a dream series, after heroic knock in Bribane test
Author
Brisbane QLD, First Published Jan 19, 2021, 3:40 PM IST

బ్రిస్బేన్: యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై ఇండియాకు చారిత్రాత్మక విజయం అందించాడు. 138 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్ కు అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో మ్యాచు మాత్రమే కాకుండా సిరీస్ ను కూడా భారత్ కైవసం చేసుకుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. 

మ్యాచ్ ముగిసిన తర్వాత రిషబ్ పంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన ప్రదర్శన ద్వారా విమర్శకుల నోళ్లు మూయించిన పంత్ తన జీవితంలో ఇది అత్యంత భారీ సంఘటన అని అన్నాడు. తాను మైదానంలోకి దిగనప్పుడు కూడా తన పక్కన నిలబడిన జట్టు సహచరులకు, సపోర్ట్ స్టాఫ్ కు అతను ధన్యవాదాలు తెలిపాడు. 

Also Read: పిచ్చెక్కిపోతోంది: సెహ్వాగ్ ట్వీట్, ఆస్ట్రేలియా జట్టుకు చురకలు

నిజానికి తనపై వచ్చిన విమర్శలకు టీ20 ప్రదర్శనతోనే రిషబ్ పంత్ జవాబు చెప్పాడు. ఇది తనకు డ్రీమ్ సిరీస్ అని అన్నాడు. టీమ్ మేనేజ్ మెంట్ తనకు ఎల్లవేళలా మద్దతు ఇచ్చిందని, నువ్వు మ్యాచ్ విన్నర్ వి అని చెబుతూ వచ్చిందని, జట్టు కోసం నువ్వు మ్యాచ్ ను గెలిపించాలని అంటూ వచ్చిందని అతను గుర్తు చేసుకున్నాడు. 

Also Read: నిరూపించుకున్నాడు: ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్

రిషబ్ మూడో టెస్టు మ్యాచులో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 97 పరుగులు చేశాడు. దాంతో మ్యాచ్ డ్రా అయింది. లేదంటే భారత్ ఓటమి పాలయ్యేది. ఇండియాకు మ్యాచ్ గెలిపించాలని తాను ప్రతి రోజూ అనుకుంటూ వస్తున్నానని, అది ఈ రోజు జరిగిందని అన్నాడు. నేడు ఐదో రోజు పిచ్ కాస్తా బంతి టర్న్ కావడానికి సహకరించిందని, దాంతో షాట్ ఎంపికలో క్రమశిక్ష పాటించాలని అనుకున్నానని పంత్ చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios