ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల టీమిండియా ఆసీస్ జట్టుతో టీ20 తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో బాగా ఆడిన టీమిండియా బౌలర్ నటరాజన్ పై ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

నెట్‌ బౌలర్‌గా వచ్చి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేతో అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్‌ నటరాజన్‌.. టీ20 సిరీస్‌లో 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. 

జట్టుకు కీలకమైన మ్యాచుల్లో మెరుగ్గా రాణించడం ద్వారా ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. దీంతో తొలి మ్యాచ్‌ నుంచి సహచర ఆటగాళ్లు, క్రికెట్‌ దిగ్గజాలు నటరాజన్‌ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం చేరాడు.

నటరాజన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన వార్నర్.. ఈ టీ20 సిరీస్ చేజార్చుకున్నందుకు బాధగా ఉందన్నాడు. అయితే.. నటరాజన్ ప్రదర్శన మాత్రం అద్భుతమని చెప్పాడు. నటరాజన్ ఆటను ఎంతో ప్రేమిస్తాడని చెప్పాడు. నెట్ బౌలర్ గా కెరీర్ ప్రారంభించి.. భారత్ తరపున అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదన్నారు. నాటరాజన్ సంపాదించిన ఘనత అమోఘమంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.