వన్డే సిరీస్‌లో ఘోర పరాభవానికి టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. సిడ్నీలో ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆసీస్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్‌లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కాగా.. ఈ సీరీస్ కైవసం చేసుకోవడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

‘‘ అమేజింగ్ గేమ్ ఆఫ్ క్రికెట్ , వెల్ డన్ బాయ్స్’’ అంటూ కోహ్లీ పోస్టు పెట్టారు. కాగా.. ఆ పోస్టుకి ఆయన భార్య  అనుష్క శర్మ స్పందించారు. మూడు హార్ట్ ఎమోజీలు కామెంట్ గా ఆమె పేర్కొన్నారు.కాగా.. అనుష్క ప్రస్తుతం నిండు గర్భిణి. వచ్చే నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)


ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మ్యాచ్ లో  లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు శిఖర్ ధావన్ (52), కేఎల్ రాహుల్ (30)లు ధాటిగా ఆరంభించారు.  తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. 

ఆ తర్వాత ధావన్‌కు జత కలిసిన కెప్టెన్ కోహ్లీ (40) అదే జోరు కొనసాగించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్థసెంచరీ చేసిన శిఖర్ ధావన్ ఔటయ్యాడు, ఆ వెంటనే సంజూ శాంసన్ (15) సైతం నిరాశపరిచాడు. కష్టాల్లో పడినట్లు కనిపించిన జట్టును హార్దిక్ పాండ్యా (42), కోహ్లీ జంట ఆదుకుంది. ముఖ్యంగా పాండ్యా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు విజయం దిశగా వెళ్తున్న వేళ కోహ్లీ ఔటవ్వడంతో భారత్ ఒత్తిడిలో పడింది. 

అయితే హార్డిక్ పాండ్యా- శ్రేయస్ అయ్యర్ (12) బాధ్యాతాయుతంగా ఆడి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి జోరుతో భారత్ రెండు బంతులు మిగిలి వుండగానే జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో శామ్స్, ఆండ్రూ టై, మిచెల్ స్వెప్షన్, ఆడం జంపా తలో వికెట్ పడగొట్టారు.