వచ్చే నెల సెప్టెంబర్ లో జరిగే వన్డే సీరిస్ కు ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్ కోసం కమ్మిన్స్ ను సిద్దం చేసేందుకే ఆసిస్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకోనున్నారట.
భారత పర్యటనకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వెళ్లడం అనుమానమేనని ఆ దేశ పత్రిక సిడ్నీ మార్నింగ్ పేర్కొంది. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కమ్మిన్స్ భారత పర్యటన సమయానికి కోలుకోవచ్చని... కానీ టీమిండియా సీరిస్ ఆడటం అనుమానమేనని పేర్కొంది. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కెప్టెన్ కమ్మిన్స్ ను భారత్ తో జరిగే సీరిస్ లో ఆడించకూడదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్ట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనేమీ ఆసిస్ క్రికెట్ బోర్డ్ చేయకున్నా ఇదే జరగనుందని సిడ్నీ మార్నింగ్ కథనం.
వచ్చే నెల సెప్టెంబర్ లో ఆసిస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఆసిస్-ఇండియా జట్ల మధ్య మూడు వన్డేల సీరిస్ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సీరిస్ జరగనుంది. అయితే ఇటీవల యాషెస్ సీరిస్ లో గాయపడ్డ ఆసిస్ కెప్టెన్ కమ్మిన్స్ ఈ సీరిస్ కు దూరం కానున్నారు. భారత పర్యటన నాటికి కమ్మిన్స్ కోలుకున్నా వన్డే సీరిస్ ఆడించకూడదని ఆసిస్ బోర్డ్ భావిస్తున్నట్లు సీడ్నీ మార్నింగ్ పత్రిక పేర్కొంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 22న మొహాలీ వేదికన వన్డే సీరిస్ ప్రారంభం కానుంది. ఒకవేళ ఈ సీరిస్ కు కమ్మిన్స్ దూరమైతే మిచెల్ మార్ష్ ఆసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. వన్డే ప్రపంచకప్ కు ముందు కెప్టెన్ కమ్మిన్స్ గాయం ఆసిస్ టీంను కంగారు పెడుతోంది.
ఇంగ్లాండ్ తో జరిగిన యాషెస్ సీరిస్ చివరి టెస్ట్ లో ఆసిస్ కెప్టెన్స్ కమ్మిన్స్ గాయపడ్డాడు. ఎడమచేతి మణికట్టు విరగడంతో అతడికి నెలరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో సెప్టెంబర్ లో జరిగే దక్షిణాఫ్రికా, ఇండియా పర్యటనలకు ఆసిస్ కెప్టెన్ దూరం కానున్నాడు. గాయంనుండి కోలుకున్నా వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ కు దూరంగానే వుండనున్నాడని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది.
