తిరిగి జట్టులోకి స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌.. ప్రపంచకప్‌కు ఆసీస్ జట్టు ఇదే..!!

First Published 15, Apr 2019, 10:36 AM IST
australia squad for ICC cricket world cup 2019
Highlights

మే 30 నుంచి జరగునున్న ఐసీపీ వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును సోమవారం సీఏ వెల్లడించింది. 

మే 30 నుంచి జరగునున్న ఐసీపీ వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును సోమవారం సీఏ వెల్లడించింది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు తుది జాబితాలో చోటు కల్పించింది.

వీరిద్దరి రాకతో పీటర్ హ్యాండ్స్‌కాంబ్, పేసర్ హేజిల్‌వుడ్‌లను బోర్డు పక్కనబెట్టింది. దీంతో అలెక్స్ కారె వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే గాయం కారణంగానే హేజల్ వుడ్ జట్టులో చోటు దక్కించుకోలేదని, యాషెస్ సిరీస్‌ నాటికి జట్టుకు అందుబాటులో ఉంటాడని ట్రెవర్ తెలిపాడు. స్టివ్ స్మిత్ జట్టులోకి వచ్చినప్పటికీ ఆరోన్ ఫించ్‌నే బోర్డు కెప్టెన్‌గా కొనసాగించింది. 

ఆస్ట్రేలియా జట్టు:

ఆరోన్ ఫించ్ (కెప్టెన్)
డేవిడ్ వార్నర్
ఉస్మాన్ ఖవాజా
స్టీవ్ స్మిత్
షాన్ మార్ష్
గ్లెన్ మ్యాక్స్‌వెల్
మార్కస్ స్టోయినిస్
అలెక్స్ కారె (వికెట్ కీపర్)
ప్యాట్ కమిన్స్
మిచెల్ స్టార్క్
నాథన్ కౌల్టర్ నీల్
రిచర్డ్సన్
జాసన్ బెహండ్రాఫ్
ఆడమ్ జంపా
 

loader