Asianet News TeluguAsianet News Telugu

బూట్లపై సందేశం .. బ్యాన్ చేసిన ఐసీసీ , పోరాడతానన్న ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా , ఇంతకీ వివాదం ఏంటీ..?

పాకిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ‘‘అందరి జీవితాలు సమానం’’ అనే సందేశాన్ని రాసిన షూస్ ధరించడానికి తనను అనుమతించకపోవడంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా నిరాశ వ్యక్తం చేశారు.

australia cricketer usman khawaja vows to fight and seek icc's approval over ban on message on shoes ksp
Author
First Published Dec 14, 2023, 2:46 PM IST

పాకిస్తాన్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ‘‘అందరి జీవితాలు సమానం’’ అనే సందేశాన్ని రాసిన షూస్ ధరించడానికి తనను అనుమతించకపోవడంపై ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా నిరాశ వ్యక్తం చేశారు. దీనిపై తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆశ్రయిస్తానని ఆయన తేల్చిచెప్పారు. ఖవాజా బూట్లపై వున్న సందేశాలను పెర్త్‌లోని ఫోటోగ్రాఫర్‌లు, రిపోర్టర్లు శిక్షణా శిబిరంలో గమనించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో పాల్గొనే సమయంలో క్రికెటర్లు ధరించే దుస్తులపై వుండే పదాలు, లోగాలకు సంబంధించి కఠినమైన నియమాలు వున్నాయి. 2014లో మొయిన్ అలీ ‘‘ సేవ్ గాజా ’’ అండ్ ‘‘ఫ్రీ పాలస్తీనా’’ అని రాసి వున్న రిస్ట్ బ్యాండ్‌లను ధరించకుండా నిషేధించారు. 

తనకు అనుమతి దక్కకపోవడంపై ఉస్మాన్ ఖవాజా స్పందించారు. ‘‘నేను నా బూట్లపై రాసుకున్నది రాజకీయం కాదు.. నేనే ఏ పక్షం వహించను. మానవ జీవితాలన్నీ నాకు సమానం. ఒక యూదు , ఒక ముస్లిం , ఒక హిందూ జీవితాలన్నీ సమానమే. నేను గొంతు లేని వారి కోసం మాట్లాడుతున్నాను. ఐసీసీ నా బూట్లను మైదానంలో ధరించకూడదని చెప్పింది. ఎందుకంటే ఇది వారి మార్గదర్శకాల ప్రకారం రాజకీయ ప్రకటని అని వారు భావిస్తున్నారు. కానీ ఇది నేను నమ్మను. ఇది కేవలం మానవతా విజ్ఞప్తి. వారి అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ నేను దానితో పోరాడి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తాను’’ అని ఖవాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపాడు. 

 

 

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మీడియా సమావేశానికి ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ‘‘ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించే మా ఆటగాళ్ల హక్కుకు మేము మద్ధతు ఇస్తున్నాము. కానీ ఐసీసీలో వ్యక్తిగత సందేశాల ప్రదర్శనను నిషేధించే నియమాలు వున్నాయి. వీటిని ఆటగాళ్లు సమర్ధిస్తామని మేం ఆశిస్తున్నాం ’’ అని సీఏ పేర్కొంది. అనంతరం పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడుతూ.. పెర్త్ టెస్టులో ఖవాజా షూస్, మేసేజ్‌లను ధరించడని తెలిపారు. ‘‘నేను అతనితో మాట్లాడాను. ఖవాజా మెసేజ్‌లు వున్న షూస్ ధరించనని చెప్పాడని , ఇది ఐసీసీ నియమ నిబంధనల కిందకు వస్తుంది. దీని గురించి ఖవాజాకు ముందుగానే అవగాహన వుందో లేదో నాకు తెలియదు ’’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. 

‘‘ అతని బూట్లపై అన్ని జీవితాలు సమనం అని రాసి వుంది. ఇది స్పష్టమైన విభజన కాదని నేను భావిస్తున్నాను. దాని గురించి ఎవరికీ అభ్యంతరాలు వుండవచ్చని నేను అనుకోను. ప్రతి ఒక్కరికి సొంత ఉద్వేగభరితమైన అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలు వుండటమే మా టీమ్‌‌లో బలమైన అంశాలలో ఒకటిగా నేను భావిస్తున్నాను. నేను దానిపైనే ఖవాజాతో క్లుప్తంగా చాట్ చేశాను. అతని ఉద్దేశం రచ్చ చేయడమని నేను అనుకోను. అయినప్పటికీ ఉస్మాన్‌కు అండగా వుంటాం. బూట్లపై వున్న ‘‘ అన్ని జీవితాలు సమానం’’ అనే నేను అనుకుంటున్నాను, దానికి నా మద్ధతు వుంటుంది ’’ అని కమిన్స్ తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios