Rodney Marsh: 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన ఆస్ట్రేలియా లెజెండ్ రాడ్ మార్ష్...
విరాట్ కోహ్లీ వందో టెస్టు ఆడబోతున్న రోజే, క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ రాడ్ మార్ష్ (రోడ్నీ మార్ష్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు...
74 ఏళ్ల రాడ్ మార్ష్, ఆస్ట్రేలియా తరుపున 96 టెస్టు మ్యాచులు ఆడారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా జట్టుకి కొంత కాలం పాటు సెలక్టర్‌గానూ వ్యవహరించారు. 1970లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాడ్ మార్ష్, వికెట్ కీపర్‌గా 14 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించారు...
రిటైర్మెంట్ సమయానికి వికెట్ కీపర్‌గా 355 వికెట్లు తీయడంతో భాగస్వామిగా వ్యవహరించిన రాడ్నీ మార్ష్... రికార్డు క్రియేట్ చేశాడు... రాడ్నీ మార్ష్, ఆస్ట్రేలయా మాజీ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ కలిసి ఒకే మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేశారు. 14 ఏళ్ల పాటు కలిసి కెరీర్‌ను కొనసాగించి ఒకే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు...
96 టెస్టుల్లో 26.51 సగటుతో 3,633 పరుగులు చేసిన రాడ్ మార్ష్, 3 సెంచరీలతో పాటు 16 హఫ్ సెంచరీలు నమోదు చేశారు. అత్యధిక స్కోరు 132 పరుగులు. 92 వన్డేలు ఆడిన మార్ష్, 4 హాఫ్ సెంచరీలతో 1225 పరుగులు చేశాు...
వన్డేల్లో వికెట్ కీపర్‌గా 120 క్యాచులు అందుకున్న రాడ్ మార్ష్, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 803 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశారు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీకి కోచ్‌గా వ్యవహరించిన రాడ్ మార్ష్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి డైరెక్టర్‌గానూ వ్యవహరించారు...
2014లో క్రికెట్ ఆస్ట్రేలియాకి సెలక్టర్‌గా నియమితుడైన రాడ్ మార్ష్, రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. కొంత కాలం కిందట అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రాడ్ మార్ష్, కోమాలోకి వెళ్లారు. కోమాలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు...
రాడ్ మార్ష్ అకాల మరణంపై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ‘రాడ్ మార్ష్ మరణవార్త విని మేం షాక్‌కి గురయ్యాం. ఆయన ఓ బ్రిలియెంట్ వికెట్ కీపర్, హార్డ్ హిట్టింగ్ బ్యాటర్. ఆస్ట్రేలియా క్రికెట్‌కి రాడ్ మార్ష్ అందించిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం...’ అంటూ పోస్ట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).
రాడ్ మార్ష్ కుారుడు డానియల్ మార్ష్ కూడా క్రికెటర్‌గా రాణించాడు. ఆల్‌రౌండర్‌గా 139 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన డాని, ఆస్ట్రేలియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం మాత్రం చేయలేకపోయాడు. అలాగే రాడ్ మార్ష్ అన్న గ్రాహం మార్ష్ ప్రొఫెషనల్ గోల్ఫ్ ప్లేయర్‌గా రాణించి, రిటైర్మెంట్ తీసుకున్నారు.
