India vs Australia: అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ఫైన‌ల్ లో విజ‌యం సాధించి ఆస్ట్రేలియా ఛాంపియ‌న్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో 254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 174 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

Under 19 World Cup final: అండ‌ర్ 19 వ‌రల్డ్ క‌ప్ 2024లో తిరుగులేని విజ‌యాల‌తో యంగ్ ఇండియా ఫైన‌ల్ మాత్రం చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఈ మ్యాచ్ లో 254 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 174 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆద‌ర్శ్ సింగ్ 47, మురుగ‌న్ అభిషేక్ 42 ప‌రుగుల‌తో రాణించారు కానీ, మిగ‌తా బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ కావ‌డంతో భార‌త్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ తో భార‌త్ ను దెబ్బ‌కొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 253-7 (50 ఓవ‌ర్లు) ప‌రుగులు చేసింది. హ్యారీ డిక్సన్ 42 పరుగులు, హ్యూ వీబ్‌జెన్ 48, హర్జాస్ సింగ్ 55, ర్యాన్ హిక్స్ 20, ఆలివర్ పీక్ 46 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లు, నమన్ తివారి 2 వికెట్లు తీసుకున్నారు. ముషీర్ ఖాన్, సౌమీ పాండేలు చెరో ఒక వికెట్ తీశారు. బౌలింగ్ లో రాణించిన భార‌త్.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయ‌కుండా నిలువ‌రించారు.

UNDER 19 WORLD CUP FINAL: భార‌త్ ను ఇక్క‌డ కూడా దెబ్బ‌కొట్టారు.. !

254 ప‌రుగ‌లు టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త్.. ఆస్ట్రేలియా బౌలింగ్ ముంద‌ట నిల‌వ‌లేకపోయింది. 174-10 (43.5 ఓవ‌ర్లు) ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ 47, ముషీర్ ఖాన్ 22 పరుగులతో రాణించారు. ఔట్ అయిన మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. సెమీస్ వరకు పరుగుల వరద పారించిన కెప్టెన్ ఉదయ్ సహరాన్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అర్షన్ కులకర్ణి 3, సచిన్ దాస్ 9, ఆరవెల్లి అవనీష్ డకౌట్, రాజ్ లింబాని డకౌట్ గా పెవిలియన్ చేరారు.

చివ‌ర్లో మురుగన్ అభిషేక్ (42 పరుగులు), నమన్ తివారీ (14*ప‌రుగుల)లు ఆస్ట్రేలియాను కాస్త కంగారు పెట్టారు. కానీ భార‌త్ కు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మహ్లీ బార్డ్‌మాన్ 3, రాఫ్ మాక్‌మిల్లన్ 3 వికెట్లు తీసుకుని భార‌త్ ను దెబ్బ‌కొట్టారు. కల్లమ్ విడ్లర్ 2, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

స్కోర్ బోర్డు: 

ఆస్ట్రేలియా 253/7 (50)
భార‌త్ 174/10 (43.5)

UNDER 19 WORLD CUP FINAL: భార‌త్ ను ఇక్క‌డ కూడా దెబ్బ‌కొట్టారు.. !