తాము ప్రేమలో ఉన్నామని.. ఇప్పటి వరకు.. వారిద్దరూ కన్ఫామ్ చేయలేదు. అయితే.. తాజాగా..  అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా వీరు ఈ విషయాన్ని కన్ఫామ్ చేయడం గమనార్హం. 

బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి... టీమిండియా ఆల్ రౌండర్ కేఎల్ రాహుల్.. పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరి ప్రేమకు.. అతియా శెట్టి.. తండ్రి సునీల్ శెట్టి కూడా .. ఒకే చేశారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు అతియా గానీ.. కేఎల్ రాహుల్ గానీ.. వారి ప్రేమ విషయాన్ని కన్ఫామ్ చేయలేదు.

View post on Instagram

ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్, విహార యాత్రలకు వెళ్తూనే ఉంటారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు.. వీరిద్దరూ కలిసి బయట తిరుగుతూ కెమేరాలకు కూడా చిక్కారు. అయితే.. తాము ప్రేమలో ఉన్నామని.. ఇప్పటి వరకు.. వారిద్దరూ కన్ఫామ్ చేయలేదు. అయితే.. తాజాగా.. అతియా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా వీరు ఈ విషయాన్ని కన్ఫామ్ చేయడం గమనార్హం.

Also Read: T20 Worldcup: ఆ రెండు మ్యాచ్ లతో టీమిండియాను జడ్జ్ చేయలేం.. జడేజా

అతియాశెట్టి ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. కేఎల్ రాహుల్.. తన ప్రేమను కన్ఫామ్ చేశాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యపి బర్త్‌డే మౌలవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు. అయితే, ఇంతకు ముందు వీరిద్దరు ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. వీరిద్దరు లవర్ అని ఇంతకుముందే తెగ రూమర్స్ వచ్చాయి. 

టీ20 ప్రపంచకప్ 2021లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియాకు స్కాట్లాండ్‌పై భారీ విజయం అవసరం. శుక్రవారం కూడా అలాంటిదే కనిపించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత స్కాట్లాండ్‌ను 85 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఆ తర్వాత కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. షమీ-జడేజా తలో 3 వికెట్లు తీయడం ద్వారా టీమ్ ఇండియా విజయానికి చాలా దోహదపడ్డారు. అయితే నెట్ రన్ రేట్‌ను కేఎల్ రాహుల్ కాపాడాడు.

కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి, 6.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా టీ20 ప్రపంచ కప్ 2021లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 263.16గా ఉంది. అభిమానులందరూ కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్‌కి ఫిదా అవుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ ప్రేయసి, నటి అథియా శెట్టి కూడా చాలా సంతోషంగా కనిపించింది.