Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: బంగ్లా చేతుల్లో పాక్ చిత్తు... ఫైనల్‌లో టాస్ గెలిచిన టీమిండియా...

కాంస్య పతక పోరులో విజేతగా బంగ్లాదేశ్ జట్టు... శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. 

Asian Games 2023: Team India won the toss in the final against Sri Lanka, Bangladesh won bronze CRA
Author
First Published Sep 25, 2023, 11:23 AM IST

ఏషియన్ గేమ్స్ 2023 ఉమెన్స్ క్రికెట్ టీ20 పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచుల నిషేధం తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది..

భారత మహిళా జట్టు: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, దేవికా వైద్య, అమన్‌జోత్ కౌర్, పూజా వస్త్రాకర్, టిటాస్ సధు, రాజేశ్వరి గైక్వాడ్

శ్రీలంక జట్టు: ఛమరి ఆటపట్టు, సుగంధిక కుమారి, ఉదేశిఖ ప్రబోధని, అనుష్క సంజీవని, ఒస్తాది రణసింగే, ఐనోక రణవీర, నీలాక్షి డి సిల్వ, ఐనోషి ప్రియదర్శిని, కవిషా దిల్హరి, హసిని పెరేరా, విష్మి గుణరత్నే

కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, కాంస్యం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. 18 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన అలియా రియాజ్ టాప్ స్కోరర్.

కెప్టెన్ నిదా దర్ 14, సదాఫ్ షమాస్ 13, నటాలియా పర్వేజ్ 11, నష్రా సంధు 3 పరుగులు చేశారు. ఆమీన్, ఉమ్మా ఈ హనీ,సదియా ఇక్బాల్ ఒక్కో పరుగు చేయగా షవాల్ జుల్ఫికర్, మునీబా ఆలీ, డియానా బెగ్ డకౌట్ అయ్యారు..

ఈ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్. షెమీమా సుల్తానా 13, శాంతి రాణి 13, శోభనా మోస్తరీ 5, కెప్టెన్ నిగర్ సుల్తానా 2, రితూ మోనీ 7, షోర్నా అక్తర్ 14, సుల్తానా ఖటున్ 2 పరుగులు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios