Asianet News TeluguAsianet News Telugu

ఏషియన్ గేమ్స్ 2023: ఫైనల్‌కి భారత క్రికెట్ జట్టు... బంగ్లాదేశ్‌పై అదిరిపోయే రివెంజ్‌! లంకతో రేపు ఫైనల్..

బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. రేపు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. 

Asian Games 2023: Team India Women beats Bangladesh in Semi Finals, Reaches finals CRA
Author
First Published Sep 24, 2023, 2:54 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత మహిళా క్రికెట్ టీమ్, ఫైనల్‌కి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందుకుంది భారత మహిళా జట్టు. 

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీమ్, బ్యాటింగ్ ఎంచుకుంది. పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీసి అదరగొట్టడంతో 17.5 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్. ఓపెనర్లు శాంతి రాణి, షెమీమా సుల్తానా గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరినీ అవుట్ చేసింది పూజా వస్త్రాకర్. 8 పరుగులు చేసిన శోభనా మోస్తరీ కూడా పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లోనే అవుటైంది..

కెప్టెన్ నిగర్ సుల్తానా 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. షోర్నా అక్తర్‌ని టిటాస్ సధు క్లీన్ బౌల్డ్ చేయగా, ఫతిమా ఖటున్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్ అయ్యింది..

22 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన రితూ మోనీ కూడా పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లోనే అవుటైంది. 3 పరుగులు చేసిన రబేయ ఖాన్, 3 పరుగులు చేసిన సుల్తానా ఖటున్, మరూఫా అక్తర్ డకౌట్ అయ్యింది. నహీదా అక్తర్ 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 

దీంతో 17.5 ఓవర్లలోనే 51 పరుగులకి ఆలౌట్ అయ్యింది బంగ్లాదేశ్ మహిళా జట్టు. అయితే 52 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్లు ఇద్దరినీ త్వరగా కోల్పోయింది. కెప్టెన్ స్మృతి మంధాన 7 పరుగులు చేసి అవుట్ కాగా షెఫాలీ వర్మ 21 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి అవుటైంది..

జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా కనికా అహుజా 1 పరుగు చేసింది. 8.2 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన ఫైనల్ చేరింది. 

మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది శ్రీలంక. పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో ఛేదించింది శ్రీలంక..

సెప్టెంబర్ 25న ఇండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్‌కి ముందు కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తలబడుతాయి. బంగ్లాతో వన్డే సిరీస్‌లో అనుచిత ప్రవర్తనతో రెండు మ్యాచుల నిషేధానికి గురైన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఫైనల్ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనుంది.. 

Follow Us:
Download App:
  • android
  • ios