Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ 5న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్! ఆసియా క్రీడలు 2023 టోర్నీల్లో భారత జట్టు షెడ్యూల్...

సెప్టెంబర్ 28న ప్రారంభమయ్యే ఆసియా క్రీడలు... అక్టోబర్ 5 నుంచి ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలో దిగనున్న భారత పురుషుల క్రికెట్ జట్టు... 

Asian Games 2023 Schedule, Team India directly qualified for quarter finals, Ruturaj Gaikwad team CRA
Author
First Published Jul 29, 2023, 8:37 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు,  2023 ఆసియా క్రీడల్లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. చైనాలో హాంగ్జౌలో సెప్టెంబర్ 28న ప్రారంభమయ్యే ఆసియా క్రీడలు, అక్టోబర్ 8న ముగుస్తాయి. తాజాగా విడుదలైన ఆసియా క్రీడల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19 నుంచి 26 వరకూ భారత మహిళా క్రికెట్ జట్టు మ్యాచులు ఆడబోతుంటే... భారత పురుషుల క్రికెట్ జట్టు, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకూ మ్యాచులు ఆడనుంది..

హాంగ్జౌలోని జీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్రికెట్ ఫీల్డ్‌లో ఆసియ క్రీడల మ్యాచులన్నీ జరుగుతాయి. భారత మహిళా జట్టుతో పాటు భారత పురుషుల జట్టు కూడా క్రికెట్ టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించాయి. భారత మహిళా జట్టు, సెప్టెంబర్ 22న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది..

ఆ మ్యాచ్‌లో గెలిస్తే, సెప్టెంబర్ 25న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడే భారత మహిళా జట్టు, సెప్టెంబర్ 26న గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ సెమీ ఫైనల్‌లో ఓడినా సెప్టెంబర్ 26న మరో సెమీ ఫైనలిస్ట్‌లో ఓడిన జట్టుతో కాంస్య పతక పోరులో తలబడుతుంది...

బంగ్లాదేశ్‌ టూర్‌లో జరిగిన మూడో వన్డేలో అతి ప్రవర్తన కారణంగా టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై రెండు మ్యాచుల నిషేధం విధించింది ఐసీసీ. దీంతో క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడే అవకాశం లేదు. భారత జట్టు ఫైనల్‌కి అర్హత సాధిస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్‌... ఆసియా క్రీడల్లో ఆడుతుంది..

భారత పురుషుల జట్టు, అక్టోబర్ 5న ఆసియా క్రీడల్లో మొదటి మ్యాచ్ ఆడుతుంది. యాదృచ్ఛికంగా అక్టోబర్ 5న మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలుకానుంది.


జూన్ 1న ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో నిలిచిన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్టు... నేరుగా ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించాయి. అక్టోబర్ 5న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే భారత పురుషుల జట్టు, ఆ మ్యాచ్‌లో గెలిస్తే అక్టోబర్ 6న సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. సెమీస్‌లో గెలిస్తే అక్టోబర్ 7న ఫైనల్ మ్యాచ్‌ ఆడుతుంది టీమిండియా. సెమీ ఫైనల్‌లో ఓడిన జట్ల మధ్య అక్టోబర్ 7నే కాంస్య పతక పోరు కోసం మ్యాచ్ జరుగుతుంది.. 

అక్టోబర్ 5న ఆసియా క్రీడల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉంది.  

ఆసియా క్రీడలు 2023 పోటీలకు భారత పురుషుల క్రికెట్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే

స్టాండ్ బై ప్లేయర్లు:  యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్  

ఆసియా క్రీడలకు భారత మహిళా క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి సర్వాణీ, టిదాస్ సధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి,  కనికా అహుజా, ఉమా ఛెత్రీ, అనుషా బారెడ్డి

స్టాండ్ బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కశ్‌వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషక్, పూజా వస్త్రాకర్ 

Follow Us:
Download App:
  • android
  • ios